PM Modi : హెల్త్ ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!

దేశంలో హెల్త్ ఎమెర్జెన్సీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని నివారించేందుకు..అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. గుజరాత్ లో ఏర్పాటు చేసిన జీ 20 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని వర్చుల్ గా ప్రసంగించారు. నిర్దేశిత 2023లక్ష్యానికి ముందే క్షయ వ్యాధి నిర్మూలనలో భారత్ ముందడుగులు వేస్తోందన్నారు.

New Update
PM Modi : హెల్త్ ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!

Modi on Health Emergency : ఆరోగ్య అత్యవసర పరిస్థితిపై ప్రధానమంత్రి మోదీ (PM  Modi) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో హెల్త్ ఎమర్జెన్సీని నివారించేందుకు అంతా సిద్ధంగా ఉండాలని కోరారు. గుజరాత్ లో ఏర్పాటు చేసిన జి 20 (G20) ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్ లో ప్రసంగించారు. ప్రజల భాగస్వామ్యంతో 2023లక్ష్యానికి కంటే ముందే భారత్ క్షయవ్యాధిని నిర్మూలించడంలో ముందడుగులు వేస్తోందని మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన COVID-19 మహమ్మారిని ప్రస్తావిస్తూ, తదుపరి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్యరంగంలో సాంకేతిక లభ్యతను అందరికీ సులభతరం చేసే విధంగా చొరవ చూపాని జి 20 సభ్యులను మోదీ కోరారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ గ్లోబల్ హెల్త్‌ (Global Health)పై గ్లోబల్ ఇనిషియేటివ్‌లు వివిధ డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్‌లను ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకువస్తాయి. ప్రజా ప్రయోజనాల కోసం ఆవిష్కరణలకు అంతా ముందుకు రావాలన్నారు. అంతర్జాతీయస్దాయి చొరవ, దేశప్రజల ప్రయత్నాలకు ఒక ఉమ్మడి వేదికగా నిలుస్తుందన్నారు. డిటిజల్ ఆవిష్కరణలు, వాటి విధివిధానాలు కూడా ఇందుకు తోడ్పడుతాయని మోదీ చెప్పారు. ప్రజల ప్రయోజనాలకోసం ఆవిష్కరణలు ముందుకు రావాని మోదీ ఈ సందర్భంగా కోరారు. ఒకే పనికి వేర్వేరు నిధుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకుంనేందుకు మనమంతా సహాకరించాలని కోరారు.

టెక్నాలజీని ఒడిసిపట్టుకుని పనిని మరింత సులభతరం చేయడం వల్ల గ్లోబల్ సౌత్ దేశాల్లో ఆరోగ్య సేవల్లో ఉన్న అంతరాయాన్నినిర్మూలించే అవకాశం వస్తుందన్నారు. నిక్షత్ మిత్ర అనే కార్యక్రమం కింద భారత్ లో దాదాపు పది లక్షలమంది క్షయరోగులను పౌరులు దత్తత తీసుకున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 2023 నాటికి ప్రపంచ లక్ష్యానికి ముందుగానే మనదేశంలో టీబీ (TB)ని నిర్మూలిస్తామని పేర్కొన్నారు.

Also Read: లోన్లు తీసుకునేవారికి బిగ్ షాక్…పెరగనున్న ఈఎంఐలు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు