/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/modi-8-jpg.webp)
PM Modi: విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. సీఎం జగన్ కు ఓవైపు పూలు చల్లుతుండగా.. మరో వైపు కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటికి రాయి తగిలింది. రాయి బలంగా తగలడంతో ఆయన ఎడమ కన్ను వాచింది. సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం అయింది.
I pray for the speedy recovery and good health of Andhra Pradesh CM @ysjagan Garu.
— Narendra Modi (@narendramodi) April 13, 2024
ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్విటర్ లో పోస్టు చేశారు.తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఖండించారు.
I condemn the stone-throwing on Hon'ble Andhra Pradesh CM Thiru @ysjagan.
Political differences should never escalate to violence. Let's uphold civility and mutual respect as we engage in the democratic process. Wishing him a quick recovery. https://t.co/YtYoOJbVy1
— M.K.Stalin (@mkstalin) April 13, 2024
ఇది కూడా చదవండి: జగన్ పై దాడి..టేక్ కేర్ అన్నా అంటూ కేటీఆర్ పోస్ట్..!