Prakash raj: చేసిందేమి లేదంటూ.. మా ప్రెసిడెంట్ పై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్‌!

"మా" ప్రెసిడెంట్‌ గా ఎన్నికైన తరువాత మంచు విష్ణు చేసింది ఏమి లేదు అంటూ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఆయన పై విమర్శలు చేశారు. కనీసం "మా"బిల్డింగ్‌ కూడా నిర్మించలేదని పేర్కొన్నారు.

New Update
Prakash raj: చేసిందేమి లేదంటూ.. మా ప్రెసిడెంట్ పై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్‌!

రెండు సంవత్సరాల క్రితం మా ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా ఎన్నికల్లో నిలిచిన నటుడు ప్రకాష్‌ రాజ్..మా అధ్యక్షుడు అయినటువంటి మంచు విష్ణు మీద ఏదోక ఆరోపణ చేస్తూనే ఉన్నారు. మరోసారి విష్ణు మీద ప్రకాష్‌ రాజ్‌ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో హట్‌ టాపిక్‌ గా మారాయి.

రెండు సంవత్సరాల క్రితం జరిగిన మా ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌ విష్ణు చేతిలో ఓడిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గెలుపొటములు సహజం. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాక పోతే మాత్రం అడిగే హక్కు నాకుంటుందని తెలిపారు.

చెప్పినట్లుగానే ఆయన మంచు విష్ణు పై ఫైర్‌ అయ్యాడు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడుతూ..మంచు విష్ణు మా ప్రెసిడెంట్‌ గా గెలిచి రెండేళ్లు అయిపోయాయి కానీ.. ఇప్పటి వరకు ఒక జనరల్‌ బాడీ మీటింగ్‌ కూడా నిర్వహించలేదు. కనీసం మా బిల్డింగ్‌ కూడా పూర్తి కాలేదు.

ఆయన్ని ప్రెసిడెంట్‌ గా ఎన్నుకు్న సభ్యులు ఇప్పుడు ఆలోచించాలి. బోగస్‌ ఓట్లు, చాలా మంది బయటి నుంచి వచ్చి ఓట్లు వేయడం వల్లే ఆయన గెలిచాడు తప్పా...ఈ రెండేళ్లలో ఆయన చేసిందేమీ లేదు. సున్నా అని చెప్పుకొచ్చారు ప్రకాష్‌ రాజ్‌. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌ గా మారాయి. మరి ఈ కామెంట్స్ పై మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆయన వ్యాఖ్యలను పలువురు ఏకీభవిస్తుండగా..మరికొందరు ఖండిస్తున్నారు. సినిమాల విషయం పక్కన పెడితే..ఎన్నో ఏళ్లుగా ప్రకాష్‌ రాజ్‌ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాడు. ట్విట్టర్ వేదికగా బీజేపీ పై విమర్శలు చేస్తుంటారు.

Also read: మోదీకొత్త ఫ్రెండ్స్‌ని చూశారా..పీఎం ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో చూడండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Singer Sunitha: ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత సంచలన వీడియో.. అసలు నిజం ఇదే!

పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత రియాక్ట్ అయ్యారు. చిన్నప్పటి నుంచి బాలు గారూ, జానకమ్మ, చిత్రమ్మ నిన్ను ఒడిలో పెట్టుకొని పెంచారు. నేను కూడా నిన్ను ముద్దు చేశా.. చెప్తే అంతా చెప్పమ్మా.. అంటూ వీడియో రిలీజ్ చేసింది సింగర్ సునీత.

New Update

Singer Sunitha: పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత రియాక్ట్ అయ్యారు.  చిన్నప్పటి నుంచి బాలు గారూ, జానకమ్మ, చిత్రమ్మ నిన్ను ఒడిలో పెట్టుకొని పెంచారు. నేను కూడా నిన్ను ముద్దు చేశా.. చెప్తే అంతా చెప్పమ్మా.. అంటూ వీడియో రిలీజ్ చేసింది సింగర్ సునీత. 

 

Advertisment
Advertisment
Advertisment