Kalki 2898AD : రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి'.. ఏకంగా అన్ని వందల కోట్లకు కుదిరిన డీల్!

'కల్కి' మూవీని ఏకంగా రెండు ఓటీటీలకు అమ్మినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. ఈ సినిమా హిందీ వెర్షన్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.200 కోట్లకు కొనుగోలు చేసిందని, అలాగే దక్షిణాది భాషల ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ రూ.175 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Kalki 2898AD : రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి'.. ఏకంగా అన్ని వందల కోట్లకు కుదిరిన డీల్!

Kalki 2898AD OTT Deal Closed : ప్రభాస్ (Prabhas) - నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో రానున్న 'కల్కి 2898AD' మూవీ కోసం సినీ లవర్స్ (Cine Lovers) ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ ఇయర్ సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమా రిలీజ్లు లేక ఖాళీ అయిన థియేటర్స్ లో 'కల్కి' సినిమా మళ్ళీ జనాల్ని థియేటర్స్ కి రప్పిస్తుందని అంతా భావిస్తున్నారు. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేసేసారు. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

రెండు ఓటీటీల్లో

ప్రభాస్ 'కల్కి' మూవీని ఏకంగా రెండు ఓటీటీలకు అమ్మినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. సుమారు రూ.500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా హిందీ వెర్షన్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ (Netflix) సంస్థ ఏకంగా రూ.200 కోట్లకు కొనుగోలు చేసిందని, అలాగే దక్షిణాది భాషల ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) రూ.175 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే కల్కి ఓటీటీ రైట్స్ మొత్తం రూ.375 కోట్లకు అమ్ముడయ్యాయన్నమాట.

Also Read : వాయిదా పడ్డ ‘హరోం హర’ మూవీ రిలీజ్.. బాధగా ఉందంటూ సుదీర్ బాబు పోస్ట్!

ప్రభాస్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ అని చెప్పొచ్చు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన ఈ చితం జూన్ 27 న పాన్ వరల్డ్ లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మూడు భాగాలుగా రానున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment