Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోస్టల్ జాబ్‌లకు నోటిఫికేషన్ రిలీజ్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో 1,899 పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

New Update
Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోస్టల్ జాబ్‌లకు నోటిఫికేషన్ రిలీజ్

Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో 1,899 పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. నిరుద్యోగులకు చల్లటి వార్తను చెవిలో వేసింది ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 1,899 ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పోస్టులను బట్టీ పది, పన్నెండు తరగతులతో పాటూ డిగ్రీ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పింది. అంతేకాదు క్రీడల్లో అర్హత సాధించిన వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.

Also Read:షమీ నిన్ను పెళ్ళి చేసుకుంటా..కానీ ఒక్క షరతు అంటూ నటి పాయల్ ఘోష్ ప్రపోజల్

పోస్టల్ అసిస్టెంట్ 598 పోస్టులు,
సార్టింగ్ అసిస్టెంట్ 143 పోస్టులు,
పోస్ట్‌మ్యాన్ 585 పోస్టులు,
మెయిల్ గార్డ్ 3 పోస్టులు,
ఎంటీఎస్‌ 570 పోస్టులు...మొత్తం 1, 899 ఉద్యోగాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది ప్రభుత్వం. ఆన్ లైన్లో లేదా పోస్టల్ ద్వారా కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చును.

Download Notification

Apply Online

మరోవైపు టీఆర్‌టీ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అయితే ఎన్నికల నేపథ్యంలో దీనికి సంబంధించిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను ఎన్నికలు పూర్తయిన తర్వాత గానీ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త సర్కారు వచ్చిన తర్వాతే విద్యాశాఖ పరీక్ష తేదీలను ప్రకటించాలని భావిస్తోంది. మొదట నవంబర్‌ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పింది. దీని ద్వారా మొత్తం 5,089 ఖాళీల భర్తీ చెయ్యనున్నారు.

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌  ఫౌండేషన్‌ విభాగం ఇచ్చే స్కాలర్ షిప్పుల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి ఈ సంస్థ ఏటా స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. ఇందులో భాగంగా 2000 రూ. స్కాలర్ షిప్ అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్‌ అభ్యర్థులకు 500 చొప్పున కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి. వీటికి  సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చును. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి  రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయ్యేంతవరకూ  ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.

Also Read:2,600రూ.లకే యూపీఐ పేమెంట్స్ తో సహా అన్ని ఫీచర్లతో జియో కొత్త ఫోన్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Civil Services results: 5సార్లు ఓడినా.. వదల్లే ఆరోసారి AIR 68వ ర్యాంక్ కొట్టిన మన తెలుగోడు

మంళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సాయి చైతన్య ఆల్ ఇండియా 68ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి కానిస్టేబుల్, తల్లి గవర్నమెంట్ టీచర్. 5సార్లు ఫెయిల్ అయినా పట్టువదలకుండా సాయి ఆరో సారి సక్సెస్ అయ్యాడు.

New Update
UPSC ranker sai

ఐఏఎస్ అధికారి అవ్వడం అంటే ఆశామాషీ కాదు. కఠోర దీక్ష, పట్టుదలతో చదవాలి. అందులోనే ఆల్ ఇండయా ర్యాంక్ కొట్టాడంటే దాని వెనుక ఎంతో కష్టం ఉండి ఉంటది. ఓసారి ఓడిపోతేనే నిరుత్సాహ పడే ప్రస్తుత యువత సాయి చైతన్య సక్సెస్ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఐదుసార్లు సివిల్స్ ఫెయిల్ అయినా.. పట్టువదలకుండా చదివి ఆరుసారి ఐఏఎస్ అయ్యాడు. మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో సాయి చైతన్య ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. అదిలాబాద్ ఏజెన్సీ ఏరియా నుంచి ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించిన యువకుడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

సాయి చైతన్య తండ్రి కానిస్టేబుల్. తల్లి టీచర్. చదువుకున్న వారికే చదువు విలువ తెలుస్తోంది. తల్లిదండ్రుల ప్రభుత్వ ఉద్యోగులే కదా.. అని తాను కష్టపడకుండా కూర్చోలేదు సాయి చైతన్య. పేరెంట్స్ కూడా అతన్ని  ఉన్నత స్థాయిలో చూడాలని ప్రోత్సహించారు. దాన్ని సాయి చైతన్య సద్వినియోగం చేసుకున్నాడు. పడిపడి లేచే కెరటంలో పోరాడి చివరికి ఆల్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు.

Also read:BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

సాయి చైతన్య సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించాడు. తల్లి గవర్నమెంట్ టీచర్, తండ్రి కానిస్టేబుల్ అని కాలు మీద కాలు వేసుకొని సుఖాలు అనుభవించలేదు. తనకంటూ సొంత గుర్తింపు కోసం పోరాడి అందులో గెలిచాడు. అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్‌ గ్రామానికి చెందినవాడు.  సివిల్స్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ రావడం ర్యాంకు రావడం ఆరేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సాయి చైతన్య అంటున్నాడు. పేదల కోసం గవర్నెన్స్ లో భాగం అవుతానని చెప్పాడు కాబోయే కలెక్టర్ సాయి చైతన్య.

Also read : Official బిగ్ బ్రేకింగ్: యూపీలో అఘోరీ అరెస్ట్

(upsc-results | adilabad | civil-services | upsc-civil-services | upsc-civil-services-exam-results)

Advertisment
Advertisment
Advertisment