Rishabh Pant: రెండో జీవితం అందరికీ రాదు.. నాకు వచ్చింది: క్రికెటర్‌!

పంత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కారు ప్రమాదంలో నరాలు దెబ్బతిన్నట్లయితే కాలు తెగిపోయే అవకాశాలున్నాయి. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అందరికీ రెండో జీవితం రాదు..కానీ నాకు వచ్చింది. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని అనే చెప్పుకోవాలి

New Update
Rishabh Pant: రెండో జీవితం అందరికీ రాదు.. నాకు వచ్చింది: క్రికెటర్‌!

Rishabh Pant: టీమిండియా క్రికెటర్‌ (Cricketer) రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫీల్డ్ లోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. అలాంటి పంత్‌ డిసెంబర్‌ 2022 లో ఘోరమైన కారు ప్రమాదానికి (Accident) గురయ్యాడు. ఆ దారుణ ఘటన నుంచి పంత్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

తన సహచర క్రికెటర్ల సెలబ్రెషన్స్‌ లో పంత్‌ కూడా మెరుస్తున్నాడు. ఈ క్రమంలోనే అతి త్వరలోనే పంత్‌ ఐపీఎల్(IPL) మ్యాచులు ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పంత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. దానిలో పంత్‌ తన ప్రమాదం గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడు.

కారు ప్రమాదం తెల్లవారుజామున చోటు చేసుకుంది.డిసెంబర్‌ నెల కావడంతో మంచు బాగా పట్టేసి ఉంది. దాంతో రహదారి నాకు కనిపించక ఈ ప్రమాదం జరిగింది అంతే కానీ..నేను మాత్రం తాగి కారు నడపలేదు. ఆ సమయంలో ఎవరో నన్ను ఆసుపత్రిలో చేర్చినట్లు నాకు తెలిసింది.

'' కారు ప్రమాదంలో నరాలు దెబ్బతిన్నట్లయితే కాలు తెగిపోయే అవకాశాలున్నాయి. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అందరికీ రెండో జీవితం(Second Life) రాదు..కానీ నాకు వచ్చింది. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని అనే చెప్పుకోవాలి. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందని నేను డాక్టర్‌ ని అడిగాను.

దానికి డాక్టర్స్‌ కనీసం 16 నుంచి 18 నెలల సమయం పడుతుందని తెలిపారు. కానీ నేను వారితో మీరు నాకు ఏం టైం లైన్ ఇచ్చినప్పటికీ నేను మాత్రం దానికంటే ఆరు నెలల ముందే కోలుకుని మీకు కనిపిస్తాను అని చెప్పా. ప్రపంచం నుంచి దూరంగా ఉండాలనుకున్నాను. ఆ నిర్ణయమే నేను వేగంగా కోలుకునేందుకు సహాయపడింది.

ప్రస్తుతానికి భవిష్యత్తు గురించి ఎలాంటి ప్లాన్స్‌ లేవని చెప్పుకోచ్చాడు పంత్‌. క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టిన తరువాతే ఎలాంటి ప్లాన్‌ చేయడానికి అయినా నేను రెడీగా ఉన్నట్లు తెలిపాడు. కారు ప్రమాదం తరువాత తీవ్ర గాయాల నుంచి పంత్‌ చాలా వేగంగా కోలుకుంటున్నాడని చెప్పుకొవచ్చు.

Also read: 25 ఏళ్ల రోడ్ మ్యాప్ కు వచ్చే 5 సంవత్సరాలు ఎంతో కీలకం!

Advertisment
Advertisment
తాజా కథనాలు