Rakhi: చేతికి ఏడు వేల రాఖీలు కట్టించుకున్న ఖాన్‌ సర్‌.. జూనీయర్ ఎన్టీఆర్‌ గుర్తొచ్చాడు భయ్యా!

ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌లో పాట్నాకు చెందిన ఖాన్‌ సర్‌కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాఖీ సందర్బంగా ఆయన స్టూడెంట్స్‌ ఖాన్‌ సర్‌పై ఉన్న ప్రేమ ఎలాంటిదో చూపించారు. దాదాపు ఏడు వేల మంది స్టూడెంట్స్‌ ఖాన్‌ సర్‌కి రాఖీ కట్టారు. ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదని ఇది ప్రపంచ రికార్డు అని ఆయన అంటున్నారు.

New Update
Rakhi: చేతికి ఏడు వేల రాఖీలు కట్టించుకున్న ఖాన్‌ సర్‌.. జూనీయర్ ఎన్టీఆర్‌ గుర్తొచ్చాడు భయ్యా!

Khan Sir claims world record 7000 students tie him Rakhi: రక్షా బంధన్ సందర్భంగా.. ప్రముఖ ఆన్‌లైన్ ట్యూటర్, పాట్నాకు చెందిన ఖాన్ సర్(Khan sir) వార్తల్లో నిలిచారు. స్టూడెంట్స్‌ ఆయన మణికట్టుపై దాదాపు 7,000 రాఖీలు కట్టారు. ప్రముఖ విద్యావేత్త అయిన ఖాన్‌ సర్‌.. తన కోచింగ్ సెంటర్‌లో రక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి వివిధ బ్యాచ్‌లకు చెందిన 10 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాదాపు 7వేల మంది బాలికలు ఆయన చేతికి రాఖీలు కట్టారు. ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదని ఇది ప్రపంచ రికార్డు అని ఆయన అంటున్నారు.

ఇంకా కట్టేవారు ఉన్నారంట:
ఈ కార్యక్రమానికి అనేక మంది విద్యార్థులు హాజరవగా.. విపరీతమైన రద్దీ కారణంగా అందరూ రాఖీలు కట్టలేకపోయారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. తనకు సొంత సోదరి లేరని ఖాన్ సర్ చెబుతున్నారు. అయితే తన దగ్గర కోచింగ్‌ తీసుకున్న ప్రతి అమ్మాయి తనకు సిస్టరేనంటున్నారు. తనకు ప్రతి సంవత్సరం విద్యార్థులు రాఖీలు కట్టేవారని చెప్పారు. తనకు కట్టినన్ని రాఖీలు ప్రపంచంలో ఎవరికీ కట్టి ఉండరని కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు ఖాన్‌ సర్. ఈ అమ్మాయిలు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్నారని, తమ కుటుంబాన్ని వదిలి తన కోచింగ్ సెంటర్‌లో చదువుకుంటున్నారని ఖాన్ సర్ తెలిపారు. వారికి టీచర్‌తో పాటు బ్రదర్‌ కూడా తానేనని చెప్పుకొచ్చారు ఖాన్‌ సర్.

ఈవెంట్ ముగిసే సమయానికి, ఖాన్ సర్ తన మణికట్టుపై 5వేల కంటే ఎక్కువ రాఖీలను కలిగి ఉన్నాడనిని సమాచారం. రోజు ముగిసే సమయానికి వాటి సంఖ్య 7వేలకి చేరుకుందని అంచనా. మణికట్టు మీద వేల సంఖ్యలో రాఖీలు ఉండడంతో ఆయన చేతిని ఎత్తడం కూడా కష్టంగా అనిపించింది. అయినా కూడా రాఖీలు తియ్యలేదు ఖాన్‌ సర్‌. ఎంతో ప్రేమతో కట్టిన రాఖీలను అలానే ఉంచుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఖాన్ సర్‌ను ప్రపంచంలోనే బెస్ట్ టీచర్‌, మంచి బ్రదర్‌ని కొనియాడారు. ఆయన్ను మించిన సోదరుడు లేరని తేల్చి చెప్పారు. కొంతమంది విద్యార్థులు తమ జీవితాంతం.. రక్షా బంధన్‌ నాడు ఖాన్ సర్‌ మణికట్టుకు రాఖీలు కట్టడం కొనసాగిస్తామని చెప్పారు. మరోవైపు చేతికి ఇన్ని రాఖీలు కనపడగానే తెలుగు వారికి జూనీయర్‌ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో జూనీయర్‌ యాక్టింగ్‌ నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాలో తారక్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాల తారక్‌ సరసన ఇలియానా, ఛార్మి ప్రధాన పాత్రలు పోషించారు.

ALSO READ: చిరుతపులితో సెల్ఫీలు..ఓరి..మీ వేషాలో.. ఎగిరి తంతే ఏట్లో పడతారు!

Advertisment