🔴 Delhi Exit Polls: ఢిల్లీ పీఠం వారిదే.. ఎగ్జిట్ పోల్స్.. లైవ్ అప్డేట్స్!
ఢిల్లీలో కొద్ది సపటి క్రితం పోలింగ్ ముగిసింది. పలు సంస్థలు మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయనున్నాయి. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
ఢిల్లీలో కొద్ది సపటి క్రితం పోలింగ్ ముగిసింది. పలు సంస్థలు మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయనున్నాయి. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆప్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు టైమ్స్ నౌ సర్వే తెలిపింది. ఆప్ 27 నుంచి 34, బీజేపీ 37 నుంచి 43, కాంగ్రెస్ 2 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. 57.70 శాతం ఓటింగ్ శాతం నమోదైంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగగా 57.70 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. బీజేపీ 51- 60 సీట్లు గెలవబోతున్నట్లు పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడించాయి.
ప్రముఖ సింగర్ మంగ్లికి అరసవల్లి సూర్య నారాయణ స్వామి ప్రొటోకాల్ దర్శనం కల్పించడంపై టీడీపీ కేడర్ ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు పేరు ఎత్తడానికే నిరాకరించిన ఆమెను కేంద్ర మంత్రి రామ్మోహన్ వెంట పెట్టుకుని ఆలయంలోకి తీసుకెళ్లడంపై మండి పడుతున్నారు.
సర్వేపై అపోహలు, అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతలను పిలిచి.. చర్చించి నివృత్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కుల గణన సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాల రూపకల్పన చేస్తామన్నారు. పబ్లిక్ డొమైన్ లో కులాల వారిగా, ఉప కులాల వివరాలను పెడతామన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డితోపాటు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను 4 వర్గాలుగా విభజించి వారితో మాట్లాడనున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు 11 శాతం రిజర్వేషన్ దక్కాల్సి ఉండగా.. 2 శాతం తగ్గించారన్నారు. మాదిగలను చేర్చిన గ్రూప్-2కు 9 శాతం రిజర్వేషన్లు సిఫారసు చేయడం సరికాదన్నారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
కులగణన సర్వే మళ్లీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. 'మేము ఈ కులగణన తప్పు అంటున్నాం. సర్వేలో మాకు అనుమానాలున్నాయి. అన్యాయం జరిగితే బీసీల ఐక్యతతో అతిపెద్ద ఉద్యమం పుట్టుకొస్తుంది' అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.