/rtv/media/media_files/2025/11/03/mamatha-2025-11-03-09-29-03.jpg)
Mamata Banerjee
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పార్టీ నుంచి తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే ఇవ్వాలని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా.. మమతా బెనర్జీకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో ఊహించని షాక్ తగిలింది.
ఇది కూడా చూడండి: Indo-Pacific Command : భారత్‌కు షాకిచ్చిన అమెరికా : 'ఇండో' పదం తొలగింపు, వివాదాస్పద మ్యాప్..
మమతా బెనర్జీతో సహా పార్టీకి చెందిన టాప్ లీడర్లు అందరూ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో గెలిచిన 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో ఏకంగా 59 మంది ఆ తర్వాత తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ రెబల్ గ్రూప్‌కు రితబ్రత బెనర్జీ నాయకత్వం వహించారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందంటూ.. తనను అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని రితబ్రత బెనర్జీ స్పీకర్ రతిన్ బసును ఆశ్రయించారు. సభలో స్పష్టమైన సంఖ్యా బలం ఉండడంతో స్పీకర్ కూడా దానికి అంగీకరిస్తూ అధికారిక ముద్ర వేశారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపంతో జూన్ 1వ తేదీన రితబ్రత బెనర్జీని మమతా బెనర్జీ వర్గం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దీదీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఒక వ్యక్తిని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా స్పీకర్ ఎలా గుర్తిస్తారని టీఎంసీ లాయర్లు ప్రశ్నించారు. స్పీకర్ రతిన్ బసు ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా, కేవలం సంఖ్యా బలాన్ని బట్టి ప్రతిపక్ష నేతను మార్చడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ఈ వాదనలపై స్పందించిన జస్టిస్ కృష్ణారావు.. టీఎంసీ ప్రతిపాదన పెండింగ్‌లో ఉండగా.. సస్పెండ్ అయిన వ్యక్తికి ఆ పదవి ఎలా ఇచ్చారని స్పీకర్‌ను వివరణ కోరారు.
ఇది కూడా చూడండి: Russia-India: ప్రపంచాన్ని శాసించే అరుదైన లోహాలు.. రష్యాతో భారత్ సీక్రెట్ డీల్!
దీనిపై అసెంబ్లీ సెక్రటరీ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో సంఖ్యా బలమే ముఖ్యం. కాబట్టి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందునే స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్న జస్టిస్ కృష్ణారావు తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేశారు. అంతవరకు స్పీకర్ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ప్రస్తుతానికి రితబ్రత బెనర్జీయే బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు. ఈ లోపు అన్ని వర్గాలు తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఇది కూడా చూడండి: Meenakshi Natarajan Case : రిటర్నింగ్ అధికారి vs ప్రజాస్వామ్యం
Follow Us