BREAKING: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా

అన్నాడీఎంకేకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. ఇప్పుడు నాలుగో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ ప్రభాకర్‌కు రాజీనామా సమర్పించారు.

New Update
FotoJet (13)

అన్నాడీఎంకేకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. ఇప్పుడు నాలుగో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ ప్రభాకర్‌కు రాజీనామా సమర్పించారు. అయితే ఇతను టీవీకేలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి ఊహించని షాక్.. ఆందోళనలో మూవీ టీమ్!

ముగ్గురు ఎమ్మెల్యేలు..

ఇదిలా ఉండగా ఇటీవల ఎమ్మెల్యేలు మరగాథం, సత్యభామ, జయకుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు నేతలు స్పీకర్‌ను నేరుగా కలిసి తమ రాజీనామా లేఖలను అధికారికంగా అందజేశారు. శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వెంటనే ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు.. టీవీకే ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఆదవ్ అర్జునతో భేటీ అయ్యారు. మంత్రి అర్జున సమక్షంలోనే వీరు త్వరలోనే అధికారికంగా తమిళగ వెట్రి కళగం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారడం కోసమే వీరు తమ పదవులను త్యాగం చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Total Fertility Rate : భారత్‌లో పడిపోతున్న జననాల రేటు (TFR)..... చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!

 ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రభుత్వం ఎదుర్కొన్న కీలకమైన బలపరీక్ష సమయంలో.. అన్నాడీఎంకే విప్‌ను ధిక్కరించి మరీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు విజయ్ వైపు నిలిచారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి విజయ్ సర్కార్‌ను సుస్థిరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండేందుకే వీరు ముందస్తుగా తమ పదవులకు రాజీనామా చేసినట్లు స్పష్టమవుతోంది. త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో వీరు ముగ్గురూ టీవీకే (TVK) పార్టీ టికెట్‌పైనే మళ్లీ బరిలోకి దిగనున్నారు.

Advertisment
తాజా కథనాలు