బీజేపీకి మద్దతుగా కేజ్రీవాల్ ప్రచారం.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే తాను బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ అన్నారు. దీనికి మోదీ సిద్ధంగా ఉన్నారా అంటూ ‘జనతా కీ అదాలత్’ బహిరంగ సభలో సవాల్ విసిరారు. హరియాణా, జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పతనం ఖాయమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 06 Oct 2024 in రాజకీయాలు Latest News In Telugu New Update షేర్ చేయండి Kejriwal: ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని మాటిచ్చి.. అధికారంలోకి రాగానే మొహం చాటేసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు ప్రతిపక్షాలపై ఆరోపణలు మాని, తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తే తాను బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివాంర ఢిల్లీలో నిర్వహించిన ‘జనతా కీ అదాలత్’ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. హామీలను నెరవేర్చుందుకు బీజేపీ సిద్ధంగా ఉందా అంటూ సవాల్ విసిరారు. బీజేపీ పతనం ఖాయం.. 'దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. హరియాణా, జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పతనం ఖాయంగా కనిపిస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాంటే ద్రోవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం. బీజేపీ ప్రజావ్యతిరేకం. బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతో పాటు ఢిల్లీలో హోమ్‌గార్డుల వేతనాలను ఇవ్వలేదు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం లేదు. ఇక్కడ ఎల్జీరాజ్యం నడుస్తోంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. #pm-modi #bjp #aap-chief-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి