Guntur Karam political punches:గుంటూరు కారం మూవీలో పొలిటికల్ పంచులు..!! టార్గెట్ ఎవరు ?

బ్రో సినిమాలో త్రివిక్రమ్ రాసిన పొలిటికల్ పంచులు ఏ రేంజ్ లో పేలాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ గుంటూరు కారం మూవీలో పొలిటికల్ పంచులు పేలనున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం.

New Update
Guntur Karam political punches:గుంటూరు కారం మూవీలో పొలిటికల్ పంచులు..!! టార్గెట్ ఎవరు ?
Guntur Karam political punches:బ్రో సినిమాలో త్రివిక్రమ్ రాసిన పొలిటికల్ పంచులు ఏ రేంజ్ లో పేలాయో అందరికి తెలిసిందే. ఇక.. సాధారణంగా త్రివిక్రమ్ కాంట్రవర్శిల జోలికి వెళ్లరు. కానీ గుంటూరు కారం మూవీ కి మొదటి నుంచి వివాదాలే . ఇప్పుడు ఈ గుంటూరు కారం మూవీలో పొలిటికల్ పంచులు పేలనున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. అటు పాలిటిక్స్ లోగాని , ఎలాంటి వివాదాల్లోకానీ తలదూర్చని గురూజీ ఈ గుంటూరు కారం మూవీ పై కాస్త ఘాటుగానే ఉన్నారు.

స్టోరీ విషయంలో గోప్యత

ఇంతవరకు గుంటూరు కారం మూవీ నుంచి రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సంక్రాంతికి గట్టిగానే వసూళ్లు సాధిస్తుందని కాన్ఫిడెన్స్ గా ఉన్నారు మేకర్స్. అయితే .. ఈ మూవీలో మహేష్ బాబు పాత్ర మాసీగా ఉంటుందని తెలుస్తోంది కానీ ..ఈ మూవీ స్టోరీ ఏంటి ?హీరో ఏం చేస్తుంటాడు? అనే విష‌యాల్ని చిత్ర బృందం చాలా గోప్యoగా ఉంచారు.

గుంటూరు కారం సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ?

పొలిటిక‌ల్ అంశాలతో ముడిపడి ఈ చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది. గుంటూరు మేయ‌ర్ రాజ‌కీయాల చుట్టూ ఈ క‌థ న‌డుస్తుంద‌ట‌. ఇక.. ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆమెని మేయ‌ర్ చేసే బాధ్య‌త మ‌హేష్ పై ప‌డుతుంద‌ట‌. ఆ ప్ర‌యాణంలో ఎదురయ్యే అవాంత‌రాలు, ఆటంకాల నేప‌థ్యంలో సినిమా సాగుతుంద‌ని స‌మాచారం. ఈ చిత్రం కోసం ‘అమ‌రావ‌తికి అటూ ఇటూ’ అనే టైటిల్ అనుకొన్నారు. ఆ టైటిల్ మ‌రీ క్లాస్ అయిపోయింద‌ని భావించిన ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ – మ‌హేష్‌ల మ‌ధ్య స‌న్నివేశాలు భావోద్వేగ‌భ‌రితంగా సాగుబ‌తాయ‌ని తెలుస్తోంది. పాట‌లూ, మ‌హేష్ గెట‌ప్‌, టైటిల్ ఇవ‌న్నీ మాసీగా ఉన్నా, ఆ స‌న్నివేశాలు మాత్రం కుటుంబ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయ‌ని స‌మాచారం.ఒకవేళ ఈ మూవీలో పొలిటికల్ అంశాలు కానీ ఉంటె ఈ సినిమా జనవరి 13న ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

ALSO READ :Sivaji:మెగా ఫ్యామిలీపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!!

Advertisment
Advertisment
తాజా కథనాలు