/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T200954.336.jpg)
Palnadu: ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు నెలకొన్న పల్నాడు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రేపటి కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలుచేశారు. వందలాది మందిని బైండోవర్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పోలీసులు కవాతు నిర్వహించారు. బయటి వ్యక్తులకు అనుమతి లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నరసరావుపేట, పిడుగురాళ్లలో డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
Also Read: లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్.. RTV సంచలన పోస్ట్ పోల్ స్డడీ