Bhuma Akhila Arrest: భూమా అఖిల ప్రియ అరెస్ట్.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి అఖిలప్రియ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున అఖిల, తమ్ముడు విఖ్యాత్, భర్త భార్గవ్‌రామ్‌ని అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డలోని వారి ఇంటికి తరలించారు. By Nikhil 23 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి చంద్రబాబు నాయుడు అరెస్టుకు (Chandrababu Arrest) నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి అఖిలప్రియ (Bhuma Akhila Priya) చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున అఖిల, తమ్ముడు విఖ్యాత్, భర్త భార్గవ్‌రామ్‌ని అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డలోని (Allagadda) వారి ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ.. ఇంట్లో కూర్చోబెట్టినంత మాత్రాన దీక్షను ఆపేది లేదన్నారు. నా తమ్ముడికి ఏదైనా జరిగితే అందుకు నంద్యాల ఎస్పీ, డీఎస్పీలే బాధ్యత వహించాలని సంచలన వాఖ్యలు చేశారు అఖిల ప్రియ. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ భూమా అఖిల ప్రియ గత రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ లోనే ఆమె దీక్ష చేపట్టారు. అఖిలతో పాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సైతం దీక్ష చేస్తున్నారు. రెండు రోజులుగా దీక్ష చేస్తున్ నేపథ్యంలో అఖిల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత అఖిలను ఆళ్లగడ్డలోని వారి నివాసానికి తరలించారు పోలీసులు. అరెస్ట్ తర్వాత సైతం దీక్షను కొనసాగిస్తానని అఖిల చెప్పడంతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆమె దీక్ష అలాగే కొనసాగిస్తే.. మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ సీఎం చంద్రబాబును(Chandrababu) సీఐడీ అధికారులు(CID Officers) తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి ఆయనను విచారించనున్నారు. చంద్రబాబును విచారించేందుకు విజయవాడ నుంచి రాజమండ్రికి బయలుదేరారు సీఐడీ అధికారులు. 12 మందితో కూడిన బృందం.. చంద్రబాబును విచారించనుంది. ఈ బృందంలోని అధికారుల పేర్లను సీఐడీ తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు సమర్పించారు. ఈ బృందంలో 9 మంది సీఐడీ అధికారులు, సిబ్బందితో పాటు ఒకక వీడియో గ్రాఫర్, ఇద్దరు మధ్యవర్తులు ఉన్నారు. వారి పేర్లతో కూడిన జాబితాను సీఐడీ తరపు న్యాయవాదులు నిన్న ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. ఆర్థిక నేరాల విభాగం-2 డీఎస్పీలు ఎం. ధనుంజయుడు, వి.విజయ్ భాస్కర్, ఎ. లక్ష్మీనారాయణ, ఇన్స్‌పెక్టర్లు ఎన్.ఎల్.వి.మోహన్ కుమార్, వై. రవికుమార్, ఐ. శ్రీనివాసన్, సీహెచ్.సాంబశివరావు, ఏఎస్సై పి. రంగనాయకులు, కానిస్టే బుల్ ఎం.సత్యనారాయణ.. ఈ బృందంలో ఉంటారని సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించారు. #tdp #nandyal-district #bhuma-akhila-priya #ap-police మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి