MLA Dola Bala Veeranjaneya Swamy: ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి హౌస్ అరెస్ట్.. పోలీసులపై ఎమ్మెల్యే సీరియస్!!

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ డోల బాల వీరాంజనేయస్వామిని పోలీసులు హౌస్ అరెస్ట్ అడ్డుకున్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇసుక సత్యాగ్రహం మూడవ రోజు బుధవారం విజయవాడలో మైనింగ్ కమిషనర్ కార్యాలయంల దగ్గర ధర్నాలో పాల్గొంటారన్న సమాచారంలో.. ముందస్తుగా పోలీసులు ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చీటికి మాటికీ మా ఇంటికి వచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న మమ్మల్ని ఇలా అడ్డుకోవడం మంచి పద్దతి కాదని అన్నారు.

New Update
MLA Dola Bala Veeranjaneya Swamy: ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి హౌస్ అరెస్ట్.. పోలీసులపై ఎమ్మెల్యే సీరియస్!!

Police Arrest MLA Dola Bala Veeranjaneya Swamy in Prakasam District: ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ డోల బాల వీరాంజనేయస్వామిని పోలీసులు హౌస్ అరెస్ట్ అడ్డుకున్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇసుక సత్యాగ్రహం మూడవ రోజు బుధవారం విజయవాడలో మైనింగ్ కమిషనర్ కార్యాలయంల దగ్గర ధర్నాలో పాల్గొంటారన్న సమాచారంలో.. ముందస్తుగా పోలీసులు ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని హౌస్ అరెస్ట్ చేశారు.

మమ్మల్ని అడ్డుకోవడం మంచి పద్దతి కాదు:

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చీటికి మాటికీ మా ఇంటికి వచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న మమ్మల్ని ఇలా అడ్డుకోవడం మంచి పద్దతి కాదని అన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి వైసీపీ మైనింగ్ మాఫియాకు పోలీసులు కొమ్ము కాస్తున్నారన్నారు. పాలేరు నదిలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తుంటే దాన్ని అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

చేతనైతే ఇసుక మాఫియా అని అరెస్ట్ చేయ్యండి:

చతుకుపాడులో ఇసుక డంపుని ఏర్పాటు చేస్తే వాళ్ల మీద చర్యలు తీసుకోకుండా ఈ అరాచకాల్ని ఎండగడుతున్న ప్రతిపక్ష నాయకుల మీద మీ ప్రతాపాలు చూపించటం సిగ్గు చేటన్నారు. మీకు చేతనైతే అక్రమంగా పాలేరు రోడ్డు నిర్మాణం చేస్తున్నటువంటి ఇసుక మాఫియా అని అరెస్ట్ చేయండని పోలీసులకు సవాల్ విసిరారు. జగన్ రెడ్డి కనుసనల్లో జరుగుతున్న ఇసుక మాఫియాకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి.

దేవినేని ఉమా అరెస్ట్:

కాగా ఇసుక పాలసీ, అక్రమ రవాణకు వ్యతిరేకంగా టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా మూడో రోజు ఆందోళనలు నిర్వహించింది. ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి తెలుగు దేశం అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వైసీపీ ఇసుక, అక్రమ మైనింగ్‌పై తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తోంది.

గుంటూరులో నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజా హౌస్ అరెస్ట్:

మరోవైపు గుంటూరులో మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజాలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే పలువురు టీడీపీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. బుధవారం టీడీపీ నేతలు మైనింగ్ శాఖ డీడీను కలవనున్నారు. అయితే దీనికి అనుమతి లేదంటూ పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్‌ లు చేసి నోటీసులు జారీ చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన మైనింగ్ ఆఫీస్‌ కు వెళ్లి ఇసుక అక్రమాలపై ఆధారాలు ఇస్తామని తెలుగు దేశం నేతలు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: TDP Chief Chandrababu: రాఖీ పౌర్ణమి వేడుకల్లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు

Advertisment
Advertisment
తాజా కథనాలు