Telangana : ఖమ్మం జిల్లాలో బంగ్లాదేశీలు..అదుపులో పదిమంది

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. పదిహేను రోజుల్లో పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు నమాచారం. వీరందరూ చాలా ఏళ్ళ క్రితమే అక్రమంగా ఇక్కడకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు.

New Update
Telangana : ఖమ్మం జిల్లాలో బంగ్లాదేశీలు..అదుపులో పదిమంది

Bangla People in Khammam : పక్క దేశం నుంచి మన భూబాగంలోకి అక్రమంగా కొందరు చొరబడ్డారు. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లోకి. వీరందరూ వచ్చి చాలా ఏళ్ళు అవుతున్నా తెలియలేదు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత వారి ఆచూకీని కనిపెట్టారు ఖమ్మం పోలీసులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరు ఎప్పుడో కొన్నేళ్ళ క్రితమే ఇక్కడకు వచ్చి సెటిల్ అయిపోయారు. వీళ్ళ దగ్గర అనుమతి పత్రాలు ఏమీ లేవు. అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. మారు పేర్లతో.. నకిలీ ఆధార్, ఫేక్ ఐడీలతో ఖమ్మం, భద్రాధ్రి కొత్తగూడెం జిల్లాల్లో(Bhadradri Kottagudem) స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

Also Read : Bharath Jodo Yatra : తేజస్వి యాదవ్ జీపులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

నకిలీ పత్రాలతో ఓటర్ కార్డులు, పాస్ పోర్టులు..

ఇక్కడకు వచ్చి సెటిల్ అవడమే కాక ఆధార్, పాస్ పోర్ట్‌లను కూడా సంపాదించుకున్నారు. వీటి కోసం నకిలీ పత్రాలను సృష్టించుకున్నారు. వాటినే చూపించి మరీ ఆధార్ లాంటివి సంపాదించుకున్నారు. ముందు రెండు వారాల క్రితం ఖమ్మం నగరంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కొత్తగూడెంలో మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా పలు చోట్ల ఇలాంటి వారు ఉన్నారని తెలియడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఆపరేషన్ స్మైల్ తో వెలుగులోకి బంగ్లాదేశీయుల జాడ..
నిందితులు బంగ్లాదేశ్(Bangladesh) నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడి బాంబే, బెంగళూర్, పశ్చిమ బెంగాల్ మీదుగా చేరుకుని ఖమ్మంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నట్లు చెబుతున్నారు ఖమ్మం పోలీసులు. ఆపరేషన్ స్మైల్(Operation Smile) లో వీరి జాడ తెలిసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు