Rahul: మణిపూర్‌పై ప్రధాని స్పందన సరిగా లేదు.. నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ!

ప్రధాని మోడీపై(pm modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi) నిప్పులు చెరిగారు. లోక్ సభలో ప్రధాని మోడీ నిన్న రెండు గంటల సుదీర్ఘ ప్రసంగం చేశారని తెలిపారు. కానీ మణిపూర్ పై ప్రధాని స్పందించిన తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందన్నారు

author-image
By G Ramu
New Update
Rahul Gandhi: అధికారంలోకి వస్తే తెలంగాణలో కుల గణన సర్వే చేపడతాం: రాహుల్ గాంధీ

Rahul Gandhi Slams Modi : ప్రధాని మోడీపై(pm modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi) నిప్పులు చెరిగారు. లోక్ సభలో ప్రధాని మోడీ నిన్న రెండు గంటల సుదీర్ఘ ప్రసంగం చేశారని తెలిపారు. ప్రధాని మోడీ మొత్తం 2 గంటల 13 నిమిషాలు మాట్లాడితే అందులో కేవలం 2నిమిషాలు మాత్రమే మణిపూర్ గురించి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ పై ప్రధాని స్పందించిన తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు.

గత కొన్ని నెలలుగా మణిపూర్ తగలబడి పోతోందన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. కానీ ప్రధాని మోడీ మాత్రం జోకులు వేసుకుంటూ మాట్లాడారని ఫైర్ అయ్యారు. అలాంటి ప్రవర్తన సరికాదన్నారు. ఇది దేశానికి ఏ మాత్రమూ మంచిది కాదని వెల్లడించారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రధాని మోడీకి తెలియడం లేదా అని నిలదీశారు. మణిపూర్‌ను రెండుగా చీల్చేశారని ఆరోపించారు.

నెలలు గడుస్తున్నా ఇంకా తమాషాలా చూస్తున్నారన్నారు. ఇండియన్ ఆర్మీని పంపిస్తే రెండు రోజుల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకు వస్తుందన్నారు. కానీ మణిపూర్ మండి పోవాలని ప్రధాని మోడీ కోరకుంటున్నారని చెప్పారు. ఆ మంటలు చల్లారాలని ప్రధాని కోరుకోవడం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ విభజన రాజకీయం చేస్తోందన్నారు. మణిపూర్‌ వెళ్లి అక్కడ ఏం జరుగుతోందో తాను స్వయంగా చూశానన్నారు.

ప్రధాని మోడీ ప్రసంగంలో దేశం గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు. రాజకీయ నేతలా ప్రధాని మోదీ మాట్లాడటం సరికాదన్నారు. ఇది అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ గురించి, ఇతర నేతల గురించి విమర్శలకే ప్రధాని ప్రసంగం పరిమితమైందన్నారు. ప్రధాని కనీసం మణిపూర్‌ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మణిపూర్‌లో భారతమాతను హత్యను చేశారని తీవ్రంగా మండిపడ్డారు.

తన మొహాన్ని టీవీలో చూడటం మోడీకి ఇష్టం లేదేమో, అందుకే తాను మాట్లాడేటప్పుడు తనను తక్కువగా చూపించారేమోనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మణిపూర్ అల్లర్లను అణచి వేసేందుకు ప్రధాని మోడీ వద్ద అనేక వ్యవస్థలు వున్నాయన్నారు. కానీ అల్లర్లను అణచి వేసేందుకు వాటిని ఉపయోగించలేదన్నారు. మోడీ కనీసం మణిపూర్ వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి వుండాల్సిందన్నారు. కానీ అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదన్నారు.

Also Read: టార్గెట్ 31.. తెలంగాణ బీజేపీ మాస్టర్ స్ట్రోక్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు