PM Modi: లోక్‌సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు : LIVE

లోక్‌సభ సమావేశాల్లో ఈరోజు ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్షాలు అడ్డుపడ్డాయి. మణిపూర్ అంశం గురించి మాట్లాడాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో విపక్షాల తీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు.

New Update
PM Modi: లోక్‌సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు : LIVE

Lok Sabha Sessions: లోక్‌సభ సమావేశాల్లో ఈరోజు ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్షాలు అడ్డుపడ్డాయి. మణిపూర్ అంశం (Manipur), నీట్‌ పేపర్ లీక్ (NEET Paper Leak) గురించి మాట్లాడాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో విపక్షాల తీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి నిరసనల మధ్యే ఆయన తన ప్రసంగం కొనసాగించారు. ' ఎన్ని కుట్రలు, ఆరోపణలు చేసినా విపక్షాలు ఓడిపోయాయి. ప్రజలు మాకు మూడోసారి అధికారం ఇచ్చారు. మా ప్రభుత్వ పథకాలు సామాన్యులకు చేరుతున్నాయి. 2014కు ముందు దేశం నిరాశలో కూరుకుపోయింది. నేడు ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది. దేశ ప్రజలు మాపై భరోస ఉంచారు. వికసిత్‌ భారత్‌లో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. పదేళ్లలో భారత్ ఖ్యాతి ఎంతో పెరిగింది. అవినీతిగా తావు లేకుండా పరిపాలన అందిస్తున్నాం. పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు.

Also Read: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీలో 3,305 ఉద్యోగాలు

2014కు ముందు ఎంతోమంది జవాన్లు అమరులయ్యారు. ఇప్పుడు భారత్‌ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. తీవ్రవాదులకు ధీటైన సమాధానం ఇస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఉగ్రదాడులపై అప్పటి ప్రభుత్వాలు నోరు మెదిపేవి కావు. పదేళ్లలో భారత్‌ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తోంది. పదేళ్లలో భారత్‌ ఆర్థిక స్థానాన్ని 10 నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో భారత్‌ అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుంది.

దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజల ప్రేమను పొందాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే క్లీన్‌స్వీప్ చేసింది. రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌,కర్ణాటలో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. కాంగ్రెస్‌ వాళ్లు ఎన్డీయేను ఓడించామని భావిస్తున్నారు. ఆ పార్టీకి ఇది మూడో అతిపెద్ద పరాజయం. 99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు సంతోషపడుతున్నాడు. కానీ 100కు 99 కాదు.. 543కు 99 వచ్చాయి. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఖాతా తెరవలేదు. సున్నా సీట్లు వచ్చినా వాళ్లు హీరోల్లా ఫీలవుతున్నారు. పరాజయాల్లో కాంగ్రెస్ రికార్డు సృష్టించింది.  కాంగ్రెస్, బీజేపీ నేరుగా పోటీపడ్డ స్థానాల్లో.. కాంగ్రెస్ స్ట్రైక్‌ రేట్‌ 26 శాతం మాత్రమే. గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసింది. కానీ ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీకి రెండు సీట్లే వచ్చాయి. మిత్రపక్షాలే కాంగ్రెస్‌ను చాలాచోట్ల గెలిపించాయి. మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 100 సీట్ల లోపే పరిమితమైంది.

Also Read: రాహుల్ స్పీచ్ పై మత పెద్దల ఫైర్.. ఎవరెవరు ఏమన్నారంటే?

రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చిన్నపిల్లాడి మనస్తత్వం ఈ సభలో చాలాసార్లు బయటపడింది. పిల్లాడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. సానుభూతి పొందేందుకే పిల్లాడి డ్రామాలు. రాహుల్ కన్నుకొడతారు, ఆలింగనం చేసుకుంటారు. చిన్న పిల్లల చేష్టల నుంచి కాంగ్రెస్‌ సభ్యులు బయటకు రావాలి. ఈవీఎం, రాజ్యాంగ రిజర్వేషన్లపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది.

నీట్‌ పేపర్‌పై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిందితులను కఠినంగా శిక్షిస్తాం. యువత భవిష్యత్తుతో ఆడుకునేవారిని వదిలిపెట్టం. ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని' ప్రధాని మోదీ అన్నారు.

.

Advertisment
Advertisment
తాజా కథనాలు