PM Modi : కచ్చతీవు ద్వీపం మీద ప్రధాని మోదీ విమర్శలు.. కాంగ్రెస్‌ను నమ్మలేనని వ్యాఖ్యలు

కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు కాంగ్రెస్ నిస్సంకోచంగా ఇచ్చిందనే వాస్తవాలు భారతీయులు ఎప్పటికీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయని అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. ఇది ప్రతీ భారతీయుడికీ కోపం తెప్పించే విషయమని అన్నారు.

New Update
PM Modi : ఆ సొమ్మంతా పేదలకే పంచి పెడతాం.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Kachchatheevu Island : 1970లలో కాంగ్రెస్(Congress) కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక(Srilanka) కు ఇవ్వడం మీద ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర విమర్శలు చేశారు. ఆ ద్వీపాన్ని శ్రీలంక వశం చేసుకోవడం మీద కాంగ్రెస్ చెప్పిన కథనాలను నమ్మలేమని ఆయన అన్నారు. కచ్చతీవును కాంగ్రెస్ ఎంత నిర్ద్వందంగా వదులుకుందో ఆ కథనాలు చెబుతాయని ఆయన అన్నారు. ఇవి వింటే లేదా చదదివితే ప్రతీ భారతీయుడికీ కోపం రాక మానదని అన్నారు మోదీ. కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మలేమని.. భారతదేశానికి(India) నష్టం కలిగించే ఇలాంటి పనులు ఎన్నో చేసిందని చెప్పుకొచ్చారు. భారతదేశ ఐక్యతను దెబ్బ తీసే విధమైన నిర్ణయాలు కాంగ్రెస్ ఎన్నో తీసుకుందని ఆరోపించారు మోదీ. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీని మీద మోదీ ఎక్స్‌లో పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

భారతదేశ సమగ్రత, ఐక్యత... ప్రయోనాలను కాంగ్రెస్ బలహీనపరిచిందని ఆరోపించారు ప్రధాని మోదీ. దివంగత మాజీ ప్రధాని నెహ్రూ...(Ex.PM Nehru) అప్పట్లో కచ్చతీవు నిర్ణయం మీద ప్రతిపక్షాలు తీవ్ర నిరశన వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. 1974లో కచ్చతీవు ద్వీపాన్ని భారత గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చిందని గత ఏడాది పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చెప్పారు. రాజకీయాల కోసం భారతమాతను మూడు ముక్కలు చేశారని తీవ్ర విమర్శలు చేశారు.

కచ్చతీవు తమిళనాడు-శ్రీలంకల మధ్య ఉన్న ద్వీపం. అప్పట్లో దీన్ని శ్రీలంక, భారతీయ మత్స్యకారులు ఇద్దరూ ఉపయోగించేవారు. అలాంటప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని శ్రీలంకకు ఎలా ఇస్తారని మోదీ ప్రశ్నించారు. రీసెంట్‌గా తమిళనాడులో జరిగిన ర్యాలీలో కూడా ప్రధాని మోదీ ఈ విషయాన్ని లేవనెత్తారు. మార్చి 15న కన్యాకుమారిలో జరిగిన ర్యాలీలో ప్రధాని "పచ్చిగా అబద్ధం" చెప్పారని, డిఎంకె గత "పాపం" కారణంగానే తమిళనాడు మత్స్యకారులు శ్రీలంక నుండి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

Also Read : VISA: బాగా పెరిగిపోయాయి…అమెరికా వెళ్ళే వారికి ఫీజుల మోత

Advertisment
Advertisment
తాజా కథనాలు