PM Modi: వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం : ప్రధాని మోదీ

ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ కోసం ఇదో పెద్ద ముందడుగు కానుందని తెలిపారు. వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం జరిగిందని విమర్శించారు.

New Update
PM Modi: వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం : ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. దేశవ్యాప్తంగా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. అయితే తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. వికసిత్ భారత్ కోసం ఇదో పెద్ద ముందడుగు కానుందని తెలిపారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి కాగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని వెనక్కి వెళ్లిందని విమర్శించారు.

Also Read: ఏపీకి కొత్త డీజీపీని నియమించిన ఈసీ.. ఎవరంటే?

' ఏపీలో యువత ఎక్కువగా ఉంటారు. టెక్నాలజీలో ముందుంటారు. కానీ వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం జరిగింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఇక్కడ సాండ్ మాఫియా లిక్కర్ మాఫియా జరుగుతోంది. గతంలో వైసీపీ.. మూడు రాజధానులు చేస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రాజధానిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేశారు. కేంద్రం 15 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీంతో రాష్ట్ర ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.

విశాఖ - చెన్నై కారిడర్ పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధితో ఏపీలో రూపురేఖలు మారుతాయి. కాంగ్రెస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు ఈడీ ఈడీ అని అరుస్తుంటారు. గతంలో కాంగ్రెస్ నేతల ఇళ్లలో భారీగా డబ్బులు దొరికాయి. వైసీపీ, కాంగ్రెస్ నెగిటివిటీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. రిఫార్మ్, ఫర్మార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌ పేరుతో ముందుకెళ్తాం. జూన్ 4న ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. డబుల్ ఇంజిన్‌తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని' ప్రధాని మోదీ అన్నారు.

Also read: ఉత్తరాంధ్రలో ఇన్ని సీట్లు గ్యారెంటీ.. ఓటమి భయంతోనే వైసీపీ ఇలా చేస్తోంది..!

Advertisment
Advertisment
తాజా కథనాలు