PM Modi: తెలుగు స్పీచ్ తో అదరగొడుతున్న మోదీ.. టెక్నాలజీని ఇలా ఫుల్లుగా వాడేస్తున్న బీజేపీ! సోషల్ మీడియాను అత్యంత సమర్ధవంతంగా వాడుకోమంటే బీజేపీ, ప్రధాని మోదీ తర్వాతనే ఎవరైనా. ఇప్పుడు ఇందులో ఒక అడుగు ముందు వేశారు ప్రధాని మోదీ. నమో ఇన్ తెలుగు అనే ట్విట్టర్ అకౌంట్‌ను మొదలుపెట్టి అందులో ఏఐ ద్వారా తన ప్రసంగాలన్నింటినీ తెలగులో వినండి అని చెబుతున్నారు. By Manogna alamuru 20 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Namo In Telugu: ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో ప్రధాని మోదీకి తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. ప్రధాని అయిన దగ్గర నుంచి ప్రజలకు అతి చేరుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ప్రధాని. దీనికి సోషల్ మీడియాను తన ప్రధాన ఆయుధంగా తీసుకున్నారు. మోదీ ఎక్కడకు వెళ్ళినా...అక్కడ ఫోటోలు లేదా వీడియోలు వెంటనే సోసల్ మీడియాలో అప్లోడ్ అయిపోవాల్సిందే. దీని కోసం ఏకంగా ఒక టీమ్‌ను పెట్టుకుంది పీఎమ్‌వో. ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీ టీమ్ సోషల్ మీడియా వాడకంలో మరో అడుగు ముందు వేసింది. ఇందులో భాగంగా ఏఐ టెక్నాలజీని ఎడాపెడా వాడేసుకోవాలని డిసైడ్ అయిపోయింది. I.N.D.I కూటమి సభ్యులు ఎల్లప్పుడూ హిందూ సంస్కృతిని & దాని ప్రజలను అగౌరవపరిచారు pic.twitter.com/PiekTwgVkT — Narendra Modi Telugu (@NaMoInTelugu) March 20, 2024 ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోంది. దీంతో చేయలేని పని లేదు. ఇప్పుడు దీన్నే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు ప్రధాని మోదీ అండ్ టీమ్. ముఖ్యంగా తెలుగు వాళ్ళని టార్గెట్ చేశారు. నమో ఇన్ తెలుగు పేరుతో ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇందులో ప్రధాని ప్రచారాలను, ప్రసంగాలను ఏఐ ద్వారా తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి వదులుతున్నారు. రాజవంశ పార్టీలు 'దోపిడీ రాజకీయాలు'పై ఆధారపడి ఉన్నాయి pic.twitter.com/WJnCotEKmc — Narendra Modi Telugu (@NaMoInTelugu) March 19, 2024 ఎన్‌డిఎ దార్శనికత 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' pic.twitter.com/FzopjtHeV2 — Narendra Modi Telugu (@NaMoInTelugu) March 19, 2024 హిందీలో ఉండే ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఏఐ తెలుగులోకి మార్చేస్తుంది. అంతేకాదు...దాన్ని అచ్చు గుద్దినట్టు తెలుగులోనే వినిపించేస్తుంది కూడా. అయితే అది ప్రధాని గొంతుతో కాకుండా వేరే గొంతుతో ఉంటుంది. కానీ వీడియోలో మోదీనే కనిపిస్తారు కాబట్టి ఆయనే మాట్లాడుతున్న ఫీల్ వస్తుంది. ఎన్‌డిఎ దార్శనికత 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' pic.twitter.com/FzopjtHeV2 — Narendra Modi Telugu (@NaMoInTelugu) March 19, 2024 నాకు తల్లులు, కుమార్తెలు మరియు సోదరీమణులు అందరూ 'శక్తి'ని పోలి ఉంటారు pic.twitter.com/3m81Hbj3NQ — Narendra Modi Telugu (@NaMoInTelugu) March 18, 2024 ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి విజయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది బీజేపీ. ఈసారి కూడా అధిక్యం సంపాదించి మళ్ళీ ప్రధాని కిరీటం పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు మోదీ. అందుకే అన్ని రాష్ట్రాల మీద దృష్టి పెట్టారు. 400 సీట్లు టార్గెట్‌గా ప్రచారాలను చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తున్నారు మోదీ. పసుపు మొదలుకుని చెరకు, ఎరువులు వరకు, ఎన్డీయే ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తోంది. pic.twitter.com/14YvaJsxho — Narendra Modi (@narendramodi) March 18, 2024 తెలంగాణ ఆకాంక్షలను బీజేపీ ఎలా నెరవేరుస్తుందో ఇక్కడ చూడండి. pic.twitter.com/eTEvNHCKfx — Narendra Modi (@narendramodi) March 18, 2024 ఈమధ్య జరిగిన చిలకలూరి పేట బహిరంగ సబలో ప్రదాని మోదీ మాట్లాడుతూ ఈ నమో ఇన్ తెలుగు గురించి చెప్పారు. తెలుగు ప్రజలందరూ తనకొక మాట ఇవ్వాలని...మీ కోసం తీసుకు వస్తున్న నమో ఇన్ తెలుగును ఫాలో అవుతామని మోదీ వాగ్దానం తీసుకున్నారు. సాంకేతికత మనల్ని మరింత దగ్గర చేసింది! నా ప్రసంగాన్ని తెలుగులో వినడానికి @NaMoInTelugu ని అనుసరించండి. దానిలో భాషను మెరుగుపరచడంపై మీ అభిప్రాయాలను కూడా నాకు తెలియజేయండి. pic.twitter.com/riT6v06sv6 — Narendra Modi (@narendramodi) March 18, 2024 మొత్తానికి ప్రజల పల్స్ పట్టుకోవడంలో ప్రధాని మోదీ ఎప్పుడూ ముందుంటారు. అందులోనే ఇలాంటి సోషల్ మీడియా జిమ్మిక్కుల విషయంలో ఇంకా ముందుంటారు. ఈ ట్విట్టర్ అకౌంట్‌కు ఇప్పటివరకు 4, 600మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో కొంతమంది బీజేపీ సపోర్టలు మాత్రం అద్భుతం, అమోఘం అని పొగిడేస్తుంటే...ఇవన్నీ ఎలక్షన్ ముందు స్టంట్స్ అని మరి కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది మాత్రం తెలుగులో వచ్చే వాయిస్ బాలేదని...ప్రధానికి ఆ గొంతు సూట్ అవ్వడం లేదని కామెంట్లు పెడుతున్నారు. వాయిస్‌ను మారిస్తే బావుంటుందని సలహాలిస్తున్నారు. Also Read:Supreme Court: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం..బోయనపల్లి అభిషేక్‌కు బెయిల్ #pm-modi #social-media #ai #namo-in-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి