PM Modi:ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గురించి ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మీద భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్ లో మాట్లాడారు. ద్విదేశ పరిష్కారాన్ని పునరుద్ఘాటించారు. By Manogna alamuru 06 Nov 2023 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి గాజా మీద ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. వైమానిక దాడులతో భూతల యుద్ధానికి కూడా దిగింది. ఈ దాడుల్లో గాజాలో సామాన్య పాలస్తీనా పౌరులు వేలల్లో చనిపోతున్నారు. వీరిలో పిల్లలు కూడా చాలా మందే ఉంటున్నారు. మరోవైపు గాజాలో పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి. దీని మీద ప్రపంచ దేశాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యుద్ధాన్ని ఆపేయమని చెబుతున్నాయి. అయినా కూడా ఇజ్రాయెల్ దాడులను ఆపడం లేదు. మరోవైపు హమాస్ కూడా తమ దగ్గర ఉన్న బంధీలను విడిచిపెట్టడం లేదు. ఈ యుద్ధం మొదలయి దాదాపు నెలన్నర రోజులు కావొస్తోంది. Also Read:శీతాకాలంలో పిల్లల్లో ఇమ్యునిటీ పెంచే నట్స్ మిల్క్ ఈ నేపథ్యంలో హమాస్ కు అండగా ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ లో మాట్లాడారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పాటూ పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితుల మీద కూడా చర్చించారు. ఇందులో ద్విదేశ పరిష్కారం గురించి ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు ప్రధాని. రెండు దేశాల మధ్య జరిగిన ఘటనలు, హింస, ప్రాణ నష్టం మీద ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పాలని కోరారు. దాని కోసం ఇరాన్ కృషి చేయాలని అన్నారు. వీటన్నిటితో పాటూ గాజాకు మానవతా సాయాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత గురించి మోదీ మాట్లాడారని పీఎంవో తెలపింది. ఈ అంశాల మీద ఇరాన్ అధ్యక్షుడు, భారత ప్రధాని ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారని చెప్పింది. దీంతో పాటూ చాబహార్ నౌకాశ్రయం సహా భారత్-ఇరాన్ ల మధ్య బహుముఖ ద్వైపాక్షిక సహకారంలో సానుకూల పురోగతిని కూడా సమీక్షించినట్లు తెలిపింది. ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపన, సుస్థిరత మీద కలిసి పని చేసేందుకు మోదీ, రైసీలు అంగీకరించారని పీఎంవో వెల్లడించింది. #modi #india #israel #iran #hamas #pm #war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి