PM Kisan : రైతులకు అలెర్ట్.. 17వ పీఎం కిసాన్‌ నిధులు మీకు రాకపోవచ్చు!

పీఎం కిసాన్‌ 16వ విడత నిధులు మొన్న ఫిబ్రవరి 28న కేంద్రం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విడతలో కొంతమంది రైతులకు డబ్బులు రాలేదు. ఇక 17వ విడత డబ్బులు కూడా కొంతమందికి కట్‌ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
PM Kisan : రైతులకు కీలక అప్‌డేట్‌.. పీఎం కిసాన్‌ 17వ విడత నిధుల ఎప్పుడంటే?

PM Kisan Installment : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan Samman Nidhi Yojana) ను అమలు చేస్తోంది. అర్హులైన రైతులు ఈ పథకంలో చేరడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున నగదును అకౌంట్లో వేస్తుంది. అంటే రైతులకు(Farmers) సంవత్సరానికి రూ. 6,000 మొత్తం ప్రయోజనం లభిస్తుంది. ఫిబ్రవరి 28న ప్రభుత్వం 16వ విడత విడుదల చేసింది. ఈ విడతలో సుమారు 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. దీని తర్వాత 17 వ విడత విడుదల అవుతాయి. అయితే ఈ విడత ప్రయోజనాలు కొంత మంది రైతులకు ఉండకపోవచ్చని మీకు తెలుసా? ఎందుకో తెలుసుకోండి!

--> నిర్ణీత గడువులోగా తమ ఆధార్ కార్డును తమ బ్యాంకు ఖాతాతో లింక్ చేసుకోని రైతులకు 17వ విడత నిలిచిపోవచ్చు. నిబంధనల ప్రకారం ఇదితప్పనిసరి. మీరు బ్యాంకుకు వెళ్లి ఈ పనిని పూర్తి చేస్తే ప్రయోజనాలను పొందవచ్చు.

--> ఈ-కేవైసీ చేయించుకోని రైతులకు మనీ రాకపోవచ్చు. 16వ విడతలో కూడా ఈ-కేవైసీ(E-KYC) చేయకపోవడంతో పెద్ద సంఖ్యలో రైతులు చెల్లింపును కోల్పోయారు. స్కీమ్ పోర్టల్ pmkisan.gov.in ద్వారా సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లండి. లేదా బ్యాంక్‌కి వెళ్లి నిర్ణీత సమయంలోగా e-KYCని పొందండి.

--> భూ ధృవీకరణ జరగని రైతులు కూడా 17వ విడతలో దూరమయ్యే అవకాశం ఉంది. ఈ పథకంతో సంబంధం ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా భూ ధృవీకరణ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మీరు కిసాన్‌ నిధిని పొందాలనుకుంటే వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయండి.

--> మీ దరఖాస్తు ఫారమ్‌లో తప్పులు ఉంటే మీకు పీఎం కిసాన్‌ నిధులు రాకపోవచ్చు.

--> మీరు ఇచ్చిన బ్యాంక్ ఖాతా(Bank Account) సమాచారం తప్పుగా ఉంటే మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోవచ్చు.

Also Read : రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? పూర్తి వివరాలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు