PM Kisan: పీఎం కిసాన్ నిధులు రాలేదా? ఇలా చేయండి.. మీ డబ్బులు మీ ఖాతాలో వెంటనే పడతాయి! ఇటివలే పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదలయ్యాయి. అయితే కొంతమందికి అర్హత ఉన్నా తమకు మనీ ట్రాన్స్‌ఫర్ అవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకవేళ మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోయి ఉంటే 1800115526 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. By Trinath 28 Jun 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను 2019 నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తారు. అర్హులైన రైతులకు ప్రభుత్వం ఏటా రూ.6వేలు అందిస్తుంది. ఈ డబ్బు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున మూడు విడతలుగా ఇస్తారు. ఈసారి కూడా 17వ విడత విడుదలైంది. అయితే మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోయినట్లయితే లేదా మీరు స్కీమ్‌కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని పొందాలనుకుంటే ఈ వార్త మీ కోసమే..! --> మీరు PM కిసాన్ యోజన లబ్ధిదారులైతే, మీరు ఇన్‌స్టాల్‌మెంట్ నుంచి e-KYC, ల్యాండ్ వెరిఫికేషన్ లేదా మరేదైనా ఏదైనా సమాచారాన్ని పొందాలనుకుంటే హెల్ప్‌లైన్ నంబర్ 155261కి కాల్ చేయవచ్చు. ఏదైన సమస్య ఉన్న కూడా ఇదే నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈ నంబర్‌కు కాల్ చేసి కొత్త అప్లికేషన్ గురించిన సమాచారాన్ని కూడా పొందవచ్చు. --> కొన్ని కారణాల వల్ల మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోయినా లేదా మీ దరఖాస్తు క్యాన్సిల్ అయినా లేదా స్కీమ్‌కు సంబంధించి ఏదైనా ఇతర సహాయం కావాలంటే, మీరు 1800115526 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. --> మీకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే, మీరు 011-23381092 నంబర్‌కు కాల్ చేయవచ్చు. మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. --> పీఎం కిసాన్ యోజన కింద, రైతులకు సహాయం చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్లు లేదా టోల్ ఫ్రీ నంబర్లు మాత్రమే ఉన్నాయని అనుకోవద్దు. నిజానికి రైతులకు సహాయం చేయడానికి ఇమెయిల్ ID కూడా ఉంది. ఇక్కడ మీరు మీ సమస్యను వివరంగా చెప్పవచ్చు. ఆ తర్వాత మీకు సరైన సహాయం అందిస్తారు. దీని కోసం మీరు పథకం అధికారిక ఇమెయిల్ ID [email protected] కి ఇమెయిల్ చేయాలి. Also Read: మోదీ గారూ సమాధానం చెప్పండి.. నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్! #pm-kisan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి