Engine Cover: విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన ఇంజిన్ కవర్.. వీడియో వైరల్ అమెరికాలోని ఓ బోయింగ్ విమానం టేకాఫ్ అవ్వగానే.. దాని ఇంజిన్ కవర్ సడెన్‌గా ఊడిపోయింది. దీన్ని గమనించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By B Aravind 08 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Engine Cover: ఇటీవల బోయింగ్ విమానాల పనితీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పడు తాజాగా మరో షాకింగ్ వీడియో వైరలవుతోంది. ఓ బోయింగ్ విమానం టేకాఫ్ అవ్వగానే.. దాని ఇంజిన్ కవర్ సడెన్‌గా ఊడిపోయింది. దీన్ని గమనించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికాలో ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 (Boeing 737-800) విమానం ఆదివారం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హౌస్టన్‌కు బయలుదేరింది. Also Read: ఇదే గాలిరా బాబోయ్..కేప్‌టౌన్‌లో ప్రకృతి ప్రతాపం అయితే డెన్వర్‌లో టేకాఫ్ అయిన పది నిమిషాలకే విమానం ఇంజిన్ కవర్ అకస్మాత్తుగా ఊడిపోయింది. కొంత భాగం రెక్కలను కూడా ఢీకొంది. దీంతో ఇది గమనించిన పైలట్.. విమానాన్ని వెంటనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. చివరికి విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. Also read: మనదేశంలోనే సెల్ఫీ పిచ్చి ఎక్కువ.. అందుకే ఈ చావులు! విమానం ఇండిన్ కవర్ ఊడిపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ ఘటనపై బోయింగ్ విమానయాన సంస్థ స్పందించింది. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పేర్కొంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు చెప్పింది. అలాగే ఈ ఘటనపై ఫెడర్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. 🚨BREAKING: Southwest Airlines Boeing 737 engine rips apart during takeoff. A Southwest Airlines flight bound for Houston immediately returned to Denver. Maybe Boeing can spend less time on DEI and focus more on safety of their aircrafts and passengers. pic.twitter.com/8iUp9WccHI — I Meme Therefore I Am 🇺🇸 (@ImMeme0) April 7, 2024 #telugu-news #national-news #boeing-flight #engine-cover మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి