Sobhita And Naga Chaitanya : మళ్లీ దొరికిపోయిన చైతు, శోభిత ధూళిపాళ.. హాలీడే ఎంజాయ్ చేస్తున్న పిక్ వైరల్ చైతు, శోభిత ధూళిపాళ డేటింగ్ రూమర్స్ తో మరోసారి వార్తల్లోకెక్కారు. లండన్ రెస్టారెంట్ లో చెఫ్ తో చైతు దిగిన ఫోటోలో శోభిత కనిపించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇప్పటికైనా వీరిద్దరు తమ రిలేషన్ పై పెదవి విప్పుతారేమో అని అందరూ అనుకుంటున్నారు. By Lakshmi Pendyala 04 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Naga Chaitanya - Sobhita Dhulipala Dating Rumors : నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్ లో ఉన్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ జంట పెదవి విప్పకపోవడంతో అంతా లైట్ తీసుకున్నారు. అయితే వీరిద్దరూ మరోసారి వార్తల్లోకి వచ్చారు. లండన్ లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈసారైనా ఈ జంట అసలు విషయాన్ని బయటపెడతారేమో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. చైతు ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్ లో సాయి పల్లవితో కలిసి తాండేల్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. మోడల్, నటి అయిన శోభిత రామన్ రాఘవన్ 2.0 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి పేరే సంపాదించింది. అడవి శేష్ హీరోగా వచ్చిన మేజర్ లో కీ రోల్ లో నటించిన శోభిత బాలీవుడ్ వెబ్ సిరీస్ తో ఫేమస్ అయ్యింది. చివరిసారిగా దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన మంకీ మ్యాన్ చిత్రంలో నటించింది శోభిత. కాగా చైతు, శోభితపై గతంలో డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు వచ్చాయి. అయితే ఈ జంట వీటిని పట్టించుకోలేదు. కాగా తాజాగా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. Also Read: నటి హేమకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ! శోభిత ధూళిపాళ, చైతు యూరప్ లో హాలిడే ఎంజాయ్ చేస్తూ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. వైన్ టేస్టింగ్ సెషన్ లో మునిగిపోయిన వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. తమ రిలేషన్ షిప్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయనప్పటికీ, వీరిద్దరూ తరచూ తమ ప్రయాణాల ద్వారా డేటింగ్ ఊహాగానాలకు తెరలేపుతున్నారు. వారి వెకేషన్ డైరీలకు సంబంధించిన ఓ వైరల్ ఫోటో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య లండన్ రెస్టారెంట్ లో చెఫ్ సురేందర్ తో కలిసి ఫోటో దిగారు. బ్యాగ్రౌండ్ లో టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న శోభిత కనిపించింది. ఈ ఫోటో ఇప్పుడు హైలైట్ అవుతోంది. చైతు 2017 లో సమంతని పెళ్లి చేసుకున్నాడు. విభేదాల కారణంగా 2021లో వీరిద్దరు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. అయితే చైతు, శోభితలు కొంతకాలంగా హాలీడేస్ ఎంజాయ్ చేస్తుండటంతో వీరి మధ్య రిలేషన్ ఏంటనేది మరోసారి చర్చ మొదలైంది. మరి ఈ జంట అధికారిక ప్రకటనతో అయినా అసలు విషయం బయటపెడతారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. #tollywood #naga-chaitanya #sobhita-dhulipala #dating #london మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి