Crime: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ దొంగలు.. ఆ బంకులే లక్ష్యంగా దోపిడీ

ఊరి చివర ఉన్న పెట్రోల్ బంకులే లక్ష్యంగా మూడు రాష్ట్రాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ ను అనంతపురం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర మూడు లక్షల నగదు, రెండు లారీలు, చేతి పంపులు, పైపు, డీజిల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు.

New Update
Crime: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ దొంగలు.. ఆ బంకులే లక్ష్యంగా దోపిడీ

Ananthapur: దేశవ్యాప్తంగా పెట్రోల్ (Petrol) బంకుల్లో వరుస దొంగతనాలు జరగడం కలకలం రేపుతోంది. నగరం, ఊరు చివర ఉన్న పెట్రోల్ బంకులే లక్ష్యంగా మూడు రాష్ట్రాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ ను అనంతపురం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో కరుగు గట్టిన నేరాలకు పాల్పడే ముఠా గుర్తింపు పొందిన పార్థీ గ్యాంగ్ గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులే లక్ష్యంగా దోపిడీ చేస్తున్నారు. అర్థరాత్రి 12:30 గంటలు 2 గంటల మధ్యలో పెట్రోలు బంకు వద్దకు చేరుకుని డీజిల్ దొంగతనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చంపుతామని బెదిరించి..
ఈ మేరకు సిబ్బంది మేల్కొని ఉంటే వారిని చంపుతామని బెదిరించి డీజిల్, డబ్బు దొంగతనం చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇలా దొంగలించిన డీజిల్ ను లారీల్లో క్యాన్ల ద్వారా నింపి, దానిని తక్కువ ధరలకు హైవేల సమీపంలో లూబ్ విక్రయాలు చేస్తున్నారు. ఇలా కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రలలో డిజిల్ దొంగతనాలు చేసిన పార్థీ గ్యాంగ్ జిల్లాలోకి ప్రవేశించిందని సమాచారం అందుకున్నపోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

ఇది కూడా చదవండి: RS Praveen: మా పిల్లలను కుక్కలు, నక్కలుగా చూస్తున్నారు.. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆర్ఎస్పీ ఆందోళన

5మంది ముఠా సభ్యులు..
పక్కా సమాచారంతో ఎస్కేయూనివర్శిటీ సమీపంలో 5మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వీరిలో కీలక సభ్యులు మరో ముగ్గరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 3.50 లక్షల నగదు, రెండు 12 చక్రాల లారీలు, 2 చేతి పంపులు, 100 మీటర్ల పైపు, 50 డీజిల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 35లక్షలు ఉంటుందని ఎస్పీ అన్బూరాజన్ వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు