Perni Nani : 'మేనమామ కొడుకు చనిపోతే శవాన్ని చూసే సంస్కారం కూడా లోకేశ్ కు లేదు' రాజకీయ లబ్ధికోసం లోకేష్ మొక్కుబడి పాదయాత్ర చేశారని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి పేర్నినాని. యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే శవాన్ని చూసే సంస్కారం కూడా లోకేష్ కు లేదని.. అప్పుడు పాదయాత్ర ఆపలేదు కానీ, చంద్రబాబు జైలుకెళ్తే మాత్రం పాదయాత్ర ఆపేశారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 22 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి YCP Perni Nani Comments : ప్రతిపక్షాలపై మాజీ మంత్రి పేర్నినాని(Perni Nani) తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. యువగళం యాత్ర పేరుతో సీఎం జగన్(CM Jagan) ను బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం అట్టర్ ఫ్లాప్ సినిమా అని.. అది పాదయాత్ర కాదు జంపింగ్ యాత్ర అని కౌంటర్లు వేశారు. యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే శవాన్ని చూసే సంస్కారం కూడా లోకేష్ కు లేదని.. అప్పుడు పాదయాత్ర కూడా ఆపలేదు కానీ, చంద్రబాబు జైలు కెళ్తే మాత్రం పాదయాత్ర ఆపేశారని మండిపడ్డారు. Also read: ఏపీ ఫుడ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డికి నిరసన సెగ.! టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పై నిప్పులు చెరిగారు. తప్పుడు వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు ఆలోచన అని ఫైర్ అయ్యారు. గతంలో 600 హామీలు ఇచ్చి గాలికి వదిలేశారని ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇక్కడకు తెచ్చారని పేర్కొన్నారు. జగన్ సంక్షేమం ఇస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని ప్రచారం చేస్తున్నారు అలాంటిది టీడీపీ మూడు రెట్లు సంక్షేమం ఎలా ఇవ్వగలరు? అని ప్రశ్నించారు. చంద్రబాబు ను సీఎం చేయడానికే పవన్ 2014 నుంచి ప్రయత్నం చేస్తున్నారన్నారు. మొత్తంగా జనసేన కు ఇచ్చేది 25 సీట్లని తెలిపారు. చంద్రబాబు-పవన్ మధ్య ప్యాకేజి వ్యవహారాలు మాత్రమే నడుస్తున్నాయన్నారు. చంద్రబాబు అధికారం లో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా పవన్ మాట్లాడతారని కామెంట్స్ చేశారు. టీడీపీ కష్టాల్లో ఉందని మద్దతు ఇస్తున్నాను అని పవన్ చెప్తున్నాడని.. అయితే, గతంలోనే ఇప్పటం సభలో టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు పవన్ ప్రకటించారని అన్నారు. మమ్మల్ని జగన్ పాలేరులు అని తిట్టిన పవన్ ఇప్పుడు ఎవరికి పాలేరుగా పనిచేస్తున్నారని అన్నారు. గతంలో లోకేష్ ను దొంగ అన్న పవన్ ఇప్పుడు ఎందుకు ఓటేయమని చెబుతున్నాడని ప్రశ్నించారు. #andhra-pradesh #lokesh #ycp #ap-ex-cm-chandrababu #perni-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి