Woman Raped : భారత పౌరులు మంచివాళ్లు : స్పెయిన్ గ్యాంగ్‌రేప్ బాధితురాలు భారత్‌లో పర్యటనకు వచ్చిన ఓ స్పెయిన్ మహిళపై ఝార్ఖండ్‌లో సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆమె పర్యటన ముగియడంతో నేపాల్‌కు వెళ్తుండగా.. భారత పౌరులు మంచివాళ్లని.. నన్ను చాలా బాగా చూసుకున్నారని అన్నారు. నేరస్థులను మాత్రమే నిందించానని పేర్కొన్నారు. By V.J Reddy 05 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Spain : ఇటీవల భారత్(India) లో పర్యటించేందుకు వచ్చిన ఓ స్పెయిన్(Spain) మహిళపై అత్యాచారం(Woman Raped) జరగడం దేశంలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా విమర్శలు చేశాయి. అయితే బాధిత మహిళ భారత్‌లో పర్యటన ముగిసిన అనంతంరం నేపాల్(Nepal) కు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. భారతీయులపై ఎలాంటి ఫిర్యాదులు లేవని.. దేశంలో దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిపారు. ఇక్కడ ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయని.. ఈ దేశ పౌరులు ఎంతో మంచివాళ్లని.. నన్ను చాలా బాగా చూసుకున్నారని అన్నారు. ప్రజలను కాదని.. నేరస్థులను మాత్రమే నిందించానని పేర్కొన్నారు. Also Read : ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు అందమైన ప్రదేశం, ప్రశాంతంగా ఉండటం వల్లే రాత్రి సమయంలో నిద్రపోవడానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నామని.. కానీ చివరకు ఇలా జరిగిందని అన్నారు. అమ్మాయిలకు నేను చెప్పేదేంటంటే.. గతాన్ని వదిలేసేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలని సూచనలు చేశారు. అలాగే తన భర్తతో కలిసి ప్రపంచయాత్రను కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆమెకు జరిగిన ఘటనపై పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారని బాధితురాలి భర్త అన్నారు. ఇదిలా ఉండగా.. బైక్‌పై ప్రపంచ యాత్ర(World Tour) చేస్తున్న స్పెయిన్ దేశస్థురాలిపై.. ఝూర్ఖండ్‌లోని దుమ్‌కా అనే జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగింది. తన భర్తతో కలిసి ఓ టెంపరరీ గుడారంలో ఉంటున్న ఆమెపై అక్కడి స్థానికులు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్ అసెంబ్లీలో కూడా తీవ్ర దుమారం రేపింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Also Read : ప్రధానిని ‘పెద్దన్న’ అంటే కాంగ్రెస్, బీజేపీ ఒకటైనట్లా: కిషన్ రెడ్డి #telugu-news #national-news #nepal #gang-rape #woman-raped మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి