Paytm: ఈసారి పేటీఎం వంతు..ఒకేసారి 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన! ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం భారీగా ఉద్యోగుల కోతకు తెరతీసిందని చెప్పుకోవచ్చు. పేటీఎం మాతృసంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్ నుంచి సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. By Bhavana 25 Dec 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కరోనా తరువాత అన్ని కంపెనీలు అన్ని తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ జాబితాలోకి ఇప్పటికే పెద్ద కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. తాజాగా వాటి జాబితాలోకి పేటీఎమ్ కూడా వచ్చి చేరింది. తాజాగా కంపెనీ నుంచి 10 శాతం మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పేటీఎం మాతృ సంస్థ అయినటువంటి ఒన్ 97 కమ్యూనికేషనస్ ఈసారి 1000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. గత కొన్ని నెలల్లో ఈ తొలగింపులు భారీగా జరిగాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. పేటీయం తన ఆర్థిక ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు మరిన్ని వ్యాపారాలను పెంచేందుకు గానూ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది స్టార్టప్ కంపెనీలకు కలిసి రాలేదని చెప్పవచ్చు. ఈ ఏడాది మొత్తం మీద 28 వేల మందికి పైగా ఉద్యోగులకు వివిధ స్టార్టప్ కంపెనీలు ఉద్వాసన పలికాయి. గతేడాది 20 వేల మందికి పైగా ఉద్యోగులను స్టార్టప్ కంపెనీలు తొలగించగా..2021లో సుమారు 4 వేల మందిని కంపెనీల నుంచి తొలగించాయి. పేటీఎం రుణ వ్యాపారంలోనే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పేటీఎం పోస్ట్ పెయిడ్ సేవల నుంచి వైదొలుగుతుందని చెప్పిన తర్వాత డిసెంబర్ 7న కంపెనీ స్టాక్ లోయర్ సర్క్యూట్‌ను తాకి 20 శాతం పతనమైంది. చిన్న రుణాల విషయంలో ముందు జాగ్రత్త విధానాన్ని అవలంబిస్తోంది. ఉద్యోగులను తొలగించిన మాట వాస్తవేమనని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. Also read: మీరు హిందువులకు, హిందీకి వ్యతిరేకం కాదని నిరూపించుకోండి రాహుల్: కవిత! #paytm #layoffs #one97 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి