Paytm: పేటీఎం వ్యవస్థాపకుడు షాకింగ్‌ నిర్ణయం!

పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బోర్డు సభ్యుడి పదవి నుంచి శర్మ తప్పుకున్నారు. విజయ్ శేఖర్ శర్మ ఈ బ్యాంక్‌లో అతిపెద్ద వాటాదారు. ఫిన్‌టెక్ సంస్థ పేటిఎంపై RBI చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

New Update
Paytm: పేటీఎం వ్యవస్థాపకుడు షాకింగ్‌ నిర్ణయం!

Paytm Founder Steps Down: పేటీఎం(Paytm) ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్ పేటిఎంకి సంబంధించిన బోర్డులో సభ్యుడిగా ఉంటారు. దీంతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ దేవేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, రిటైర్డ్ ఐఏఎస్ రజనీ సేఖ్రీ సిబల్ బోర్డు సభ్యులుగా ఉంటారు. బోర్డులో ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. విజయ్ శేఖర్ శర్మ రాజీనామా తర్వాత PPBL ఇప్పుడు కొత్త ఛైర్మన్‌ను నియమించే ప్రక్రియను ప్రారంభించింది.

ఆ ఇద్దరు కూడా ఔట్:
పేటిఎం వ్యవస్థాపకుడు రాజీనామా చేయడానికి ముందు ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు బోర్డు నుంచి రాజీనామా చేశారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా , ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (PWC) మాజీ ఎగ్జిక్యూటివ్ షింజినీ కుమార్ డిసెంబరులో రాజీనామా చేయగా, మరోవైపు మాజీ SBI డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మంజు అగర్వాల్ కూడా బోర్డు నుంచి రాజీనామా చేశారు.

ఫిన్‌టెక్ సంస్థ పేటిఎంపై RBI చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. నో యువర్ క్లయింట్ (KYC) నిబంధనలలో నిర్లక్ష్యం కారణంగా, రిజర్వ్ బ్యాంక్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కఠినమైన ఆంక్షలు విధించింది. మార్చి 15 తర్వాత కొత్త డిపాజిట్లు లేదా టాప్-అప్‌లు చేయడంపై నిషేధం ఇందులో భాగం. అలాగే నిధుల బదిలీ, బిల్లు చెల్లింపు, UPI మినహా ఇతర సేవలు ఉపయోగించుకునే ఛాన్స్ లేదు. ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్‌ను మార్చి 15 వరకు ఉపయోగించవచ్చు.

డిజిటల్ KYCపై ఆందోళన..
ఫిన్‌టెక్ సంస్థలు(Fintech Companies) నిర్వహించే డిజిటల్ కస్టమర్ గుర్తింపు ప్రక్రియతో RBI అసౌకర్యంగా ఉంది. ఎందుకంటే ఇందులో వ్యక్తి గుర్తింపును ధృవీకరించడానికి ఆధార్..  మొబైల్ నంబర్ వంటి ప్రభుత్వ గుర్తింపు రుజువు ఉపయోగిస్తారు.  కానీ ఆర్బీఐ అంచనా ప్రకారం, వీటిని తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. అందువల్ల  మోసం లేదా మనీలాండరింగ్ టెన్షన్ పెరుగుతోంది.  ఈ ధృవీకరణ పద్ధతిని ఉపయోగించడాన్ని RBI నిషేధించకపోయినా..  కస్టమర్ గుర్తింపు కోసం సెంట్రల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఫిజికల్ గా లేదా లేదా వీడియో-కాల్ ద్వారా కస్టమర్ ఐడెంటిఫికేషన్ పూర్తి చేస్తే తప్ప.. డిజిటల్‌గా అప్రూవ్ అయిన ఎకౌంట్స్  ప్రాసెస్ చేయడం సాధ్యం కాదని తెలిపింది. 

Also Read: ‘నువ్వు ఇంతకన్నా ఏం పీకలేవ్‌..’ సింపతి గేమ్స్‌ వద్దు విహారీ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు