Paytm Effect: పేటీఎం ఎఫెక్ట్.. ఫిన్‌టెక్ కంపెనీలపై ఆర్బీఐ దృష్టి.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో కేవైసీ నిబంధనల అవకతవకలు జరిగాయంటూ ఆర్బీఐ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీని తరువాత మిగిలిన ఫిన్‌టెక్ కంపెనీల వ్యవహారాలపై నిశితంగా పరిశీలన చేస్తోంది ఆర్బీఐ. ఈ పరిశీలనలో చాలా ఫిన్‌టెక్ కంపెనీలు కేవైసీ ప్రమాణాలు పాటించడం లేదని తేలింది. By KVD Varma 22 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Paytm Effect - RBI Focus on Fintech Companies: కస్టమర్ కి సంబంధించిన నియమాలు, ఇతర నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఫిన్‌టెక్ కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాడార్ కిందకు వచ్చాయి. Paytmపై చర్య తర్వాత, బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ RBI ఇప్పుడు ఇతర ఫిన్‌టెక్ కంపెనీల పరిశీలనను పెంచింది. రెగ్యులేటర్ గతేడాది సాధారణ తనిఖీల తర్వాత ఈ చర్యలు చేపట్టింది. ఆర్బీఐ పరిశీలనలో చాలా కంపెనీలు కేవైసీ ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. నియంత్రిత సంస్థలచే ఈ ఉల్లంఘనలను (Paytm Effect) గుర్తించడానికి ఆర్‌బిఐ మెరుగైన సాంకేతికతపై కూడా పెట్టుబడి పెడుతోంది. లక్షలాది మంది కస్టమర్ల వ్యక్తిగత డేటాను అధ్యయనం చేసేందుకు రెగ్యులేటర్ ఎనలిస్టులను నియమిస్తోంది. Paytm తర్వాత, థర్డ్-పార్టీ ఫిన్‌టెక్ సంస్థల ద్వారా బిజినెస్-టు-బిజినెస్ కార్డ్ చెల్లింపులను నిలిపివేయాలని ఈ నెల RBI వీసాని కోరింది. డిజిటల్ KYCపై ఆందోళన.. ఫిన్‌టెక్ సంస్థలు(Fintech Companies) నిర్వహించే డిజిటల్ కస్టమర్ గుర్తింపు ప్రక్రియతో RBI అసౌకర్యంగా ఉంది. ఎందుకంటే ఇందులో వ్యక్తి గుర్తింపును ధృవీకరించడానికి ఆధార్.. మొబైల్ నంబర్ వంటి ప్రభుత్వ గుర్తింపు రుజువు ఉపయోగిస్తారు. కానీ ఆర్బీఐ అంచనా ప్రకారం, వీటిని తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. అందువల్ల మోసం లేదా మనీలాండరింగ్ టెన్షన్ పెరుగుతోంది. ఈ ధృవీకరణ పద్ధతిని ఉపయోగించడాన్ని RBI నిషేధించకపోయినా.. కస్టమర్ గుర్తింపు కోసం సెంట్రల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఫిజికల్ గా లేదా లేదా వీడియో-కాల్ ద్వారా కస్టమర్ ఐడెంటిఫికేషన్ పూర్తి చేస్తే తప్ప.. డిజిటల్‌గా అప్రూవ్ అయిన ఎకౌంట్స్ ప్రాసెస్ చేయడం సాధ్యం కాదని తెలిపింది. Also Read: గూగుల్ ప్లే స్టోర్ కి పోటీ.. ఫోన్ పే ఇండస్ యాప్ స్టోర్ వచ్చేసింది దర్యాప్తు రౌండ్ పెరిగింది ఫిన్‌టెక్ కంపెనీలు చెల్లింపుల నుండి చిన్న రుణాలు, డిపాజిట్ల వరకు అనేక సేవలను అందిస్తాయి. వారి ఆర్థిక ప్రభావం పెరిగేకొద్దీ, వాటిని నియంత్రించడం కోసం విస్తృత ఆర్థిక వ్యవస్థతో వారి సంబంధాలపై పరిశీలనను తీవ్రతరం చేస్తున్నారు. గతేడాదిలో త్రైమాసికానికి ఒకసారి ఈ కంపెనీల వ్యవహారాలపై విచారణ జరిగేది. ఇప్పుడు అది నెలకు ఒకసారి చేస్తున్నారు. కస్టమర్ గుర్తింపు, నిధులను నియంత్రించే ప్రాథమిక నియమాలను అనుసరించాలని రెగ్యులేటర్ చెబుతోంది. Watch this Interesting Video: #rbi #paytm #fintech-companies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి