Pawan Kalyan: తండ్రికి ఉన్న గుణం కొడుక్కి లేదు

కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు రాజశేఖర్‌ రెడ్డికి ఉన్న ఒక్క మంచి లక్షణం కూడా లేదన్నారు.

New Update
Pawan Kalyan : 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు రాజశేఖర్‌ రెడ్డికి ఉన్న ఒక్క మంచి లక్షణం కూడా లేదన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేదలకు మంచి చేస్తే జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం పేదల రక్తాన్ని పీల్చుతున్నారని విమర్శించారు. రాజశేఖర్‌ రెడ్డి అనుకున్నది సాధించే వరకు విశ్రమించని వ్యక్తి అన్నారు. కానీ జగన్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫోటోతో ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చ లేదన్నారు.

తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మహిళల ఓట్లను దోచుకున్న జగన్‌.. ఇప్పుడు ఉన్న మద్యాన్ని నిషేధించడం పక్కన పెడితే కొత్త మద్యాన్ని రాష్ట్రంలో విక్రయిస్తూ మహిళల మెడలో తాలిబొట్లు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జే మద్యం, బుల్ బుల్ మద్యాన్ని సేవించడం వల్ల రాష్ట్రంలో అనేక మంది మరణించినట్లు జనసేన అధినేత గుర్తు చేశారు. 2019లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఫొటో చూసి ప్రజలు ఓట్లు వేశారన్న పవన్‌.. ఇప్పుడు జగన్‌ చేస్తున్న అరాచకాలు చూస్తున్నారన్నారు.

రానున్న ఎన్నికల్లో జగన్‌ మోహన్‌ రెడ్డి గెలుపొందడం అసాధ్యమన్నారు. వైసీపీ ఎన్ని ఎత్తుగడులు వేసినా మళ్లీ సీఎం కాలేడని, ఛాన్స్‌ దొరుకుతుందో లేదో తెలియకనే జగన్‌ చంద్రబాబుపై ఉన్న కక్షను ఇప్పుడే తీర్చుకుంటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్‌ చంద్రబాబును అరెస్ట్‌ చేసి పెద్ద తప్పు చేశారన్న పవన్‌.. అందుకే పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు మద్దతు వస్తోందన్నారు. మరోవైపు పవన్‌ వారాహి విజయ యాత్రలో జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ALSO READ: మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Explosives Case : వైసీపీకి షాక్‌..పేలుడు పదార్థాల నిల్వ కేసులో వైసీపీ నేత అరెస్ట్

అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వచేసిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.20 లక్షల విలువైన జిలిటెన్‌ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రి, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వైసీపీ నేత దాసం హనుమంతరావుతో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు.

New Update
Explosives Case

Explosives Case

Explosives Case : అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వచేసిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.20 లక్షల విలువైన జిలిటెన్‌ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రి, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో వైసీపీ నేత దాసం హనుమంతరావుతో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్టూరు మండలం నాగరాజుపల్లిలో పొలాల్లో ఉన్న ఓ గోదామును  దాసం హనుమంతరావు కొన్నేళ్లుగా సబ్‌ లీజుకు తీసుకొని అందులో పేలుడు పదార్థాలు నిల్వ చేస్తున్నారు. నిజానికి పేలుడు పదార్థాల నిల్వకు హనుమంతరావు గతంలో అనుమతి తీసుకున్నప్పటికీ అది గతనెల 31న ముగిసింది. అయినప్పటికీ పేలుడు పదార్థాల నిల్వను కొనసాగిస్తూ వస్తున్నాడు.

Also Read:  Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!


కాగా తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌ జిల్లా కేంద్రంగా బిల్లులు లేకుండా పేలుడు పదార్ధాలు విక్రయిస్తున్న సాల్వో ఇండస్ట్రీ్‌స్‌ నుంచి ఈనెల 19న అక్రమంగా పేలుడు పదార్థాలు తీసుకొచ్చినట్లు పోలీసులకు తెలిసింది.దీంతో రైడ్‌ చేయగా  క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగించే 5,000 కేజీల పేలుడు పదార్ధాలు, 2,300 ఈడీలు లభ్యమయ్యాయి.  అక్కడే ఉన్న నిందితుడు హనుమంతరావునూ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలని జిల్లా ఎస్పీని హోంమంత్రి అనిత ఆదేశించారు. గత ప్రభుత్వంలో జరిగిన పేలుళ్ల ఘటనలతో ఏళ్ల తరబడి ఇదే వ్యాపారంలో ఉన్న వైసీపీ నేత సహకారం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలన్నారు. హనుమంతరావుతోపాటు దాసం వీరాంజనేయులు, నాగండ్ల ప్రసన్న, బత్తుల సాంబశివరావు, ప్రతాప్‌రెడ్డి, సాల్వో పరిశ్రమపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. 

Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్

విచారణకు హోంమంత్రి ఆదేశం 


మార్టూరు, బల్లికురవ ప్రాంతాల్లో వైకాపా నేతలు కొందరు అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారన్న దానిపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. గ్రానైట్‌ వ్యాపారం ముసుగులో జిలిటెన్‌ స్టిక్స్‌ టన్నుల కొద్దీ తరలిస్తున్నట్లు వెలుగుచూడటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Also Read: Pavani Reddy : మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!

Also Read: Prakasam: క్రికెట్ గ్రౌండ్‌లో పిడుగుపాటు.. చెట్టుకిందికెళ్లిన ఇద్దరు బాలురు మృతి

Advertisment
Advertisment
Advertisment