Pawan Kalyan: సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా...డిప్యూటీ సీఎం నా మజాకానా...

పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది ప్రస్తుతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా తమ్మడు రీ రిలీజ్ అయింది. దీంతో పవన్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

New Update
Pawan Kalyan: సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా...డిప్యూటీ సీఎం నా మజాకానా...

Tammudu Re Release: ఈరోజు తమ్ముడు సినిమా రీరిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరోసారి తమ్ముడిని థియేటర్లలో రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి గా పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సినిమాను రీరిలీజ్ చేశారు. తమ్ముడు సినిమా అప్పట్లోనే పెద్ద హిట్ అయింది. అదో సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు రీరిలీజ్‌లో కూడా మరోసారి దాన్ని సూపర్ హిట్ చేశారు పవన్ అభిమానులు. థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. దీని తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో సుదర్శన్ థియేటర్ దగ్గర పవన్ కల్యాణ్ పెద్ద కటౌట్‌ను ఏర్పాటు చేశారు అభిమానులు. ఆయన రాజకీయ నాయకుడులా ఉన్న పోస్టర్‌ను పెట్టారు. దాని చుట్టూ భారీఆ ఫైర్ వర్క్స్ పెట్టి హంగామా చేశారు. కట్ అవుట్ పై పూలు భారీగా ఎగరవేసి, థియేటర్ బయట డాన్సులు వేస్తూ పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారు.

Also Read:Hyderabad: అవినీతికి అడ్డాగా ఆ పోలీస్ స్టేషన్.. ఒకే సారి 12 మంది సీఐలు, నలుగురు ఎస్ఐలు ఔట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment