ఈరోజు నుంచే పార్లమెంట్ ప్రత్యేక భేటీ.

కొత్త పార్లమెంట్ లో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలు ఈరోజు నుంచే మొదలవుతున్నాయి. ఐదు రోజులపాటూ ఈ సమావేశాలు జరగుతాయి. ఈరోజుకి పాత బిల్డింగ్ లోనే భేటీ జరుగుతుంది. రేపు వినాయకచవితి సందర్భంగా కొత్త పార్లమెంటుకు ఉభయ సభలూ మారతాయి.

New Update
ఈరోజు నుంచే పార్లమెంట్ ప్రత్యేక భేటీ.

కొత్త పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధం అయింది. భేటీలో మొదటి రోజు 75 ఏళ్ళ ప్రయాణం మీద చర్చించనున్నారు. దీంతో పాటూ పలు కీలక బిల్లుల కూడా చర్చిస్తారని తెలస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడే కొత్త బిల్డింగ్ గజద్వారం మీద ఉపరాష్ట్రపతి, రాజ్య సభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక మంగళవారంనాడు ఎంపీలందరికీ ప్రత్యేక ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులంతా ఆరోజు ఉదయం 9.30 గంటలకు గ్రూప్ ఫోటో సెషన్ కు అటెండ్ కావాలని లోక్ సభ సెక్రటేరియట్ కోరింది.

ఇక పార్లమెంటులో ప్రధాన ఎన్నికల కమీషనర్, ఇతర ఎన్నికల కమీషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీంతో పాటూ లోక్ సభలో ది అడ్వొకేట్స్ బిల్లు, 2023 దిప్రెస్ అండ్ రిజస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, ది పోస్టాఫీస్ బిల్లు ఉన్నాయి. వన్ డే వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్, ఉమ్మడి పౌరస్మృతి, దేశం పేరు మార్పు బిల్లుల గురించి కూడా చర్చిస్తారని ప్రచారం జరుగుతున్నా....కేంద్రం మాత్రం ఏమీ కన్ఫార్మ్ చేయలేదు.

మరోవైపు చైనా దురాక్రమణ, కుప్పకూలుతున్న ఆర్ధిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదానీ కంపెనీకి అక్రమాలు లాంటి కీలక అంవాల మీద సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ పట్టు బడుతోంది. దీనికి సంబంధించి సోనియాగాంధీ ఇది వరకే ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల మీద కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ కు హాజరైన కర్ణాటక ఉపముఖ్యమంత్రి పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్ గురించి స్పందించారు. ఎలాంటి ఎజెండా లేకుండా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం దేశ చిరిత్రలో ఇదే మొదటిసారి అని డీకె మండిపడ్డారు. దీన్ని బట్టి దేశంలో చట్టాల పరిస్థితి ఏమిటనేది అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pooja Hegde: ‘రెట్రో’ మూవీపై బుట్టబొమ్మ వైరల్ పోస్ట్..

సూర్య, పూజా హెగ్డే జంటగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రెట్రో’ మూవీ మే 1న తమిళ, తెలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే తాజాగా పూజ ఈ మూవీకి డబ్బింగ్ ప్రారంభించినట్లు తెలిపిన పోస్టు వైరల్ అవుతూ సినిమాపై హైప్ పెంచేసింది.

New Update
Retro Movie Pooja Hegde

Retro Movie Pooja Hegde

Pooja Hegde: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్ ‘రెట్రో’(Retro) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాక్షన్ డ్రామాను ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. 1980ల కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా చేసుకొని రూపొందుతున్న ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

Also Read: ఇకపై అంతా చీకట్లోనే.. షాకిచ్చిన్న నేషనల్ క్రష్..

మే 1న 'రెట్రో' గ్రాండ్ రిలీజ్

ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమాను మే 1న తెలుగుతో పాటు తమిళ భాషలో పాన్ రీజినల్ రీతిలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్, గ్లింప్స్ ప్రేక్షకుల నుండి భారీ స్పందనను రాబట్టాయి. దీంతో 'రెట్రో'పై ఆడియన్స్ అంచనాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా సూర్య- పూజా హెగ్డే కాంబినేషన్‌ చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ఇక తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రెట్రో మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ అప్‌డేట్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది.

pooja retro dubbing
pooja retro dubbing

 

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

సూర్య స్టైల్, కార్తీక్ సుబ్బరాజ్ విజన్, పూజా హెగ్డే గ్లామర్ మేళవింపుతో 'రెట్రో' ఈ సమ్మర్‌లో ఓ మోస్ట్‌వాంటెడ్ మూవీగా మారిందనడంలో సందేహమే లేదు.

#Retro #surya #pooja hegde
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు