U-WIN : ఆగస్టు చివరినాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి యూ-విన్

దేశవ్యాప్తంగా సాధారణ టీకాల ట్రాకింగ్, నమోదు కోసం ఆగస్టు చివరినాటికి యూ-విన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది.గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలకు వేసే ప్రతి వ్యాక్సిన్‌ను కూడా ఈ యూ-విన్‌లో నమోదు చేయనున్నారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేసే ఈ పోర్టల్‌లో ఈ-టీకా సర్టిఫికేట్‌ను పొందవచ్చు.

New Update
U-WIN : ఆగస్టు చివరినాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి యూ-విన్

U-WIN Portal : దేశవ్యాప్తంగా సాధారణ టీకాల కార్యక్రమ ట్రాకింగ్, నమోదు కోసం ఆగస్టు చివరినాటికి యూ-విన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కొవిడ్ వ్యాక్సినేషన్‌ పోర్టల్‌ కొ-విన్‌ (Co-Win) కు నకలుగా ఈ పోర్టల్‌ ఉండనుంది. దీన్ని పశ్చిమ బెంగాల్‌ (West Bengal) లో తప్ప మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

Also Read: భయపెడుతున్న డెంగ్యూ.. ఏడుగురు మృతి

గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలకు వేసే ప్రతి వ్యాక్సిన్‌ను కూడా ఈ యూ-విన్‌ (U-WIN) లో నమోదు చేయనున్నారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేసే ఈ పోర్టల్‌లో ఈ-టీకా సర్టిఫికేట్‌ను పొందవచ్చు. రియల్ టైమ్‌లో పనిచేసే ఈ పోర్టల్‌ లేదా ఆండ్రాయిడ్ మొబైల్‌ అప్లికేషన్‌ (Android Mobile Application) లో కావాలనుకున్న వ్యాక్సిన్‌ కేంద్రంలో టీకాలు పొందేందుకు పౌరులు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టీకా వేయించుకునే టైమ్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు.

Also read: ప్రధాని మోదీ రికార్డ్‌.. ఎక్స్‌లో 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు