Egg: ఒక్క ఎగ్ రూ.32.. పాకిస్థాన్ లో దారుణ పరిస్థితులు!

పాకిస్తాన్‌ తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. పౌష్టికాహారం అయినటువంటి కోడిగుడ్డును కూడా కొనలేని స్థితికి అక్కడి ప్రజలు చేరుకున్నారు. ఎందుకంటే ఒక కోడిగుడ్డు ధర రూ. 32 కి చేరుకుంది.

New Update
Iron Deficiency: ఐరన్‌ లోపం ఉందా..? తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే

దాయాది దేశమైన పాక్‌ లో ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తిండి లేక చాలా మంది ఆకలి బాధలతో చనిపోతున్నారు. పాక్‌ ని ఆర్థిక సంక్షోభం తీవ్రంగా వెంటాడుతుంది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కనీసం ఓ కోడిగుడ్డును కూడా కొనలేని పరిస్థితుల్లో పాక్ ప్రజలు ఉన్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో ఒక కోడి గుడ్డు ధర రూ. 32కు చేరుకుంది. దీంతో కనీసం ఓ గుడ్డు తినాలన్నా హడలి పోతున్నారు. డజన్‌ గుడ్ల ధర రూ. 360 కి చేరుకుంది. గత కొద్ది రోజుల్లో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. పాకిస్తాన్‌ మీడియా కూడా కోడిగుడ్లు ధరలు పెరిగినట్లు తెలిపింది. అయితే డజను గుడ్లను 360 కి విక్రయించాలని అక్కడి ప్రభుత్వం తెలిపినప్పటికీ కూడా వ్యాపారులు మాత్రం రూ. 389 కి అమ్ముతున్నారు.

దీనిని బట్టి చూస్తే ఒక్కో గుడ్డు ధర రూ. 32 లు అనమాట. పాక్‌ లో రోజురోజుకి ఆహారం , ఇంధనం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెరికా డాలరుతో పోల్చి చూసుకుంటే..పాక్‌ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. దాని వల్లే పాక్‌ లో నిత్యావసర వస్తువులు ధరలు కొండెక్కి కూర్చున్నాయి.

సోయాబీన్స్‌ ని దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన్నప్పటికీ ..ఇంకా నోటిషికేషన్‌ జారీ చేయలేదు. ద్రవ్యోల్బణం రోజురోజుకి పెరుగుతున్నట్లు ఆల్‌ పాకిస్తాన్‌ బిజినెస్‌ ఫోరం తెలిపింది. ఇలా అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ పోతే అక్కడ ప్రజలు బతకడం చాలా కష్టమని అధికారులు వివరించారు.

గతంలో కూడా పాక్‌ లో రొట్టెల పిండి కోసం తీవ్ర పోరాటమే జరిగింది. ఆ ఘటనలో చాలా మంది చనిపోయినట్లు సమాచారం కూడా. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. పాక్‌ లో 30 డజన్ల (360 గుడ్లు) కోడిగుడ్లను రూ. 10,500 నుంచి రూ. 12,500 వరకు అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read: శంషాబాద్‌ రన్‌ వే ని కప్పేసిన పొగమంచు..35 విమానాల దారి మళ్లింపు!

Advertisment
Advertisment
తాజా కథనాలు