Congress: పాకిస్థాన్.. బీజేపీకి శత్రు దేశం.. మాకు కాదు: కాంగ్రెస్ నేత బీజేపీకి పాకిస్థాన్ శత్రు దేశం కొవొచ్చని తమకు మాత్రం పొరుగు దేశమని కర్నాటకకు చెందిన బీకే హరిప్రసాద్ అనే కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. By B Aravind 28 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి కర్నాటకకు చెందిన బీకే హరిప్రసాద్ అనే కాంగ్రెస్ నేత.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి పాకిస్థాన్ శత్రు దేశం కొవొచ్చని తమకు మాత్రం కాదని అన్నారు. కమలం పార్టీకి పాకిస్థాన్ శత్రు దేశమైన.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం పాక్‌ను పొరుగదేశంగానే చూస్తోందని వ్యాఖ్యానించారు. కర్నాటక రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాక.. ఆ తర్వాత అసెంబ్లీలో పాకిస్థాన్ దేశానికి చెందిన అనుకూల నినాదాలు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బీకే హరిప్రసాద్ ఈ విధంగా మాట్లాడారు. Also read: 2029 నుంచి జమిలి ఎన్నికలు..! కేంద్రానికి ప్రతిపాదన చేయనున్న లా కమిషన్ అప్పుడు శత్రు దేశం కాదా ? పాకిస్థాన్‌ను శత్రు దేశం అని అంటున్నారు. లాహోర్‌లో జిన్నా సమాధిని సందర్శించి.. ఆయన వంటి సెక్యులర్ నాయకుడు మరొకరు లేరని ఎల్‌కే అద్వాని చెప్పారని హరిప్రసాద్ అన్నారు. అద్వానీకి ఇటీవల వారు భారతరత్న ప్రధానం చేశారు. అప్పుడు పాకిస్థాన్ శత్రుదేశం కాదా అంటూ హరిప్రసాద్ బీజేపీని శాసలమండలిలో నిలదీశారు. దీంతో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఇంకా కొనసాగిస్తోంది భారతదేశంపై పాకిస్థాన్ నాలుగుసార్లు యుద్ధం చేసినా కూడా..ఆ దేశాన్ని శత్రు దేశమని కాంగ్రెస్ చెప్పడం లేదని బీజేపీ నిలదీసింది. కాంగ్రెస్ జాతి వ్యతిరేక భావాలను కలిగి ఉందని ఆరోపణలు చేసింది. నెహ్రూ-జిన్నా మధ్య సాన్నిహిత్యాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రస్తుత తరం కూడా కొనసాగిస్తోందని విమర్శించింది. పాకిస్థాన్ బీజేపీకి శత్రు దేశం.. కాంగ్రెస్‌కు పొరుగుదేశమని చెప్పడం దీన్ని స్పష్టం చేస్తోందని ఎక్స్(ట్విట్టర్)లో తెలిపింది. Also read: సచిన్ జమ్మూ పర్యటన.. ప్రధాని మోదీ ఏమన్నారంటే #congress #bjp #pakisthan #bk-hari-prasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి