National: పార్లమెంటులో నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం

చాలా ఏళ్ళ తర్వాత పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉండబోతున్న ఇండియా కూటమి తమ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అన్నింటకన్నా ముందుగా నీట్, నిరుద్యోగం లాంటి అంశాల మీద చర్చించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నేతలు సమావేశమయ్యారు.

New Update
National: పార్లమెంటులో నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం

INDIA Bloc: పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాల గురించి ఇండియా కూటమి నేతలు చర్చించుకున్నారు. మల్లాకార్జున ఖర్గే ఇంట్లో.. రాహుల్ గాంధీతో పాటు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్, ఆప్ నేత సంజయ్ సింగ్, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ తదితర నేతలు నమావేశమయ్యారు.పార్లమెంటు సమావేశాల్లో నీట్ ఎగ్జామ్ అవకతవకలు, అగ్నివీర్, నిరుద్యోగం వంటి అంశాల విషయం గురించి చర్చకు పెట్టాలని నేతలు డిసైడ్ అయ్యారు.

దాంతో పాటూ స్పీకర్ ఎన్నిక, రాష్ట్రప్రతి ప్రసంగం మీద కూడా చర్చించారు. డీఎంకే ఎంపీ టీ రవి మాట్లాడుతూ, నీట్ అంశంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా నీట్ అంశంపై రేపు పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిక్షం డిమాండ్ చేయనుంది. ఒకవేళ ఈ అంశంపై చర్చించేందుకు అధికార పక్షం అనుమతించకుంటే సభలో నిరసన తెలపాలని భావిస్లోంది. సోవరాం నుంచి మదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో మొదటి రోజు నుంచే పాల్గొనాలని అనుకుంటోంది. రాష్ట్రపతి ప్రసంగం మీ ధన్యవాద తీర్మానం చర్చలో కూడా పాల్గొనాలని ఇండియా కూటమి డిసైడ్ అయింది.

Also Read:Kalki 2898 AD: రికార్డులు బద్ధలే..ప్రపంచ వ్యాప్తంగా కల్కి మూవీ ఫీవర్

Advertisment
Advertisment
తాజా కథనాలు