Maldives Issue Row:మాల్దీవుల అధ్యక్షునిపై అవిశ్వానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం భారత్‌తో మాల్దీవుల గొడవ ఆదేశ అధ్యక్షుని నెత్తి మీదకు వచ్చింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవక ముందే అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మీద అవిశ్వాసానికి పిలుపునిచ్చింది ప్రతిపక్షం. భారత్ మీద మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల మహ్మద్ మొయిజ్జూపై ఒత్తిడి నెలకొంది. By Manogna alamuru 09 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Maldives President:ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరో బలైనట్టు...మంత్రుల చేసిన వ్యాఖ్యలకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మెడకు చుట్టుకున్నాయి. ఒకవైపు బారత్ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది మరోవైపు ఇప్పుడు ఇవే అంతర్గతంగా కూడా అక్కడి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. అధికార పార్టీ మీద ప్రతిపక్సాలు ఇదే అదనుగా దాడి చేస్తున్నాయి. అధికార పార్టీపై అక్కడి ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది. భారత్‌తో వివాదాన్ని తెచ్చుకోవడం మాల్దీవులకు మంచిది కాదని సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాల్దీవుల్లోని ప్రతిపక్ష పార్టీ అధినేత.. అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూపై అవిశ్వాసానికి పిలుపునిచ్చారు. Also read:కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో విజిలెన్స్ అధికారుల సోదాలు మహ్మద్ మొయిజ్జూను ఎలా అయినా అధికారంలో నుంచి తప్పించాలని చూస్తున్నాయి అక్కడి ప్రతిపక్ష పార్టీలు. మాల్దీవుల్లోని పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్.. అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూపై అవిశ్వాస తీర్మానానికి పిలుపునిచ్చారు. మొయిజ్జూను అధికారం నుంచి తొలగించాలని కోరారు. మాల్దీవులతో ఇతర దేశాల సత్ససంబంధాలను కొనసాగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అలీ అజీమ్ చెప్పారు. గొడవ ఎలా మొదలైంది అంటే... భారత ప్రధాని మోడీ రీసెంట్‌గా లక్షద్వీప్‌లో పర్యటించారు. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. వీటినచూసి చాలా మంది నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలు బొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇలాంటి మాటలతోనే పోస్ట్‌లు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. వారి పోస్ట్‌లను ఎక్స్ నుంచి తొలగించారు కూడా. వెంటనే ఖండించిన ప్రభుత్వం.. మంత్రుల వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలే తప్ప, విద్వేషాన్ని, ప్రతికూల ప్రభావాన్ని కలిగించేలా ఉండొద్దు. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సంబంధాలను దెబ్బతీయొద్దు అని పేర్కొంది. అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ కూడా వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించారు. బారత్‌తో తమకు మంచి సంబధాలున్నాయని...వాటిని దెబ్బ తీసేవిధంగా మాట్లాడ్డం సరైంది కాదని అన్నారు. అయినా కూడా ప్రస్తుతం అధ్యక్షుడి మీద ప్రతిపక్షం దాడులు చేస్తోంది. #india #maldives #president #opposition #impeachment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి