మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ ని చీల్చాడు! డిప్యూటీ సీఎం అయ్యాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీతో పొత్తుపెట్టుకొని శరద్ పవార్ కన్నా ఎక్కువ సీట్లు సాధించి మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యారు. అజిత్ పవార్ 70 వేల కోట్ల స్కాం చేసాడని, స్వయంగా పీఎం నరేంద్ర మోదీ గతంలో అతనిమీద ధ్వజమెత్తారు. ప్రస్తుత మహారాష్ట్ర సీఎం పడన్వీస్ అయితే అజిత్ పవార్ కు జైల్లో చక్కి పీసింగ్ తప్పదు, అన్నాడు, అలాంటి వారు, అజిత్ పవార్ ను, అటు శివసేన నుంచి చీల్చి ఏక్ నాద్ షిండే ను, ఆయన వర్గం ఎమ్మెల్యే లతో రాగా, బీజేపీకి వీళ్లకన్నా ఎక్కువ సీట్లు ఉన్నా, బీహార్ లో సీఎం నితీష్ కుమార్ కు మద్దతు ఇచ్చినట్లు ఇచ్చి షిండే ను సీఎం చేసారు. అప్పుడు ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఈ ముగ్గురు కల్సి పోటీ చేసారు. మంచి విజయాన్ని అందుకున్నారు. మరోవైపు తాజాగా అజిత్ పవార్ బినామీ ఆస్తుల కేసులో ఆదాయ పన్ను(ఐటీ) శాఖ క్లీన్ చిట్ ఇచ్చేసింది. 2021లో సీజ్ చేసిన రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను క్లియర్ చేసింది. విపక్షా హోదా దక్కని పరిస్థితి! కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రే శివసేన చాలా తక్కువ, అనే ఎవరికి కూడ కనీసం విపక్ష హోదా దక్కని పరిస్థితి వచ్చింది. ఈ సారి ఫడ్నవీస్ సీఎం, షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలు అయ్యారు. దాదాపు అందరి కేసులు మూసేసారు. అస్సాం సీఎం హేమంత్ బిస్వ శర్మ చెప్పినట్లు బీజేపీ లో చేరినప్పటికీ కేసుల మాఫీ ఉండదనే మాటకు చరమ గీతం పాడుతూ, బీజేపీ రాజకీయ వాషికింగ్ మిషన్ లో పడగానే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసారు. ఇందులో వెయ్యి కోట్ల లాభం అజిత్ పవార్‌కు జరిగింది. తాజాగా ఐటీ విభాగం గతంలో జప్తు చేసిన ఆయన వెయ్యి కోట్ల ఆస్తులకు విముక్తి కలిగించారు. ఇప్పుడాయన నంబర్ వన్ నిజాయితీ పరుడు అయిపోయాడు. కొడుకు, భార్య మీద కేసులు హుష్ కాకి అయిపోయాయి! గోవాలో రిసార్ట్, ముంబయిలో 184 కోట్లు, ఇలా జైపూర్, ఎక్కడెక్కడో ఉన్న అజిత్ పవార్ ఆస్తులకు రిలీజ్ ఆర్డర్ ఇచ్చేసారు. 30 ఏండ్లుగా 62 వేల కేసులు! మొత్తం 70 స్తావరాల్లో దాడులు చేసి జప్త్ చేసిన ఆస్తులన్ని వాపస్ ఇవ్వడం తో గత 30 ఏండ్లుగా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్న 62,000 కేసుల్లో ఉన్నవారు, ముక్తి కోసం అజిత్ పవార్ ను సంప్రదించాలని అనుకున్నట్లు చెబుతున్నారు. ఆయన లాగా బీజేపీ వాషింగ్ మిషన్ లోకి దూకుదామని, అనుకుంటున్నారేమో, లేకుంటే అజిత్ పవార్ పేరు పెట్టుకుంటే విముక్తి ఏమైనా లభిస్తుంది ఏమో చూడాలి! అని అంటున్నారట! అజిత్ దాదా ను మూకుమ్మడిగా కలిస్తే ఐటి కేసుల నుంచి తప్పించుకునే కమాల్ ఏమైనా చెబుతాడేమో చూద్దాం! అజిత్ పవార్ స్టోరీ ప్రస్తుతం భారతదేశం అధికార రాజకీయ చిత్రం గా భావించాలి! ఇది ఇక్కడ అజిత్ పవార్ తో ఆగే స్టోరీ కాదు. దీనికి ఎన్డ్ ఎప్పుడో ప్రధాని నరేంద్ర మోడీనే అడగాలి! ఇక పై అందరూ అజిత్ పవార్ లే నా! ఒక వైపు నిజాయితీగా టాక్స్ పే చేసే వారికి ప్రోత్సాహకాలు ఇస్తాము, అంటారు. ఐటి ఎగవేత దారులను వదిలేది లేదు,అంటారు.ఒక వైపు 2021 లో అజిత్ పవార్ ఆస్తులు అటాచ్ చేసిన వెయ్యి కోట్ల ఆస్తులకు విముక్తి కల్పిస్తారు.టాక్స్ పేయర్ల వల్ల దేశం నడుస్తుంది అంటారు, పీఎం!దేశం నిర్మాణం లో టాక్స్ డబ్బులే కీలకం అంటారు. ఇప్పుడు ఇలా, తమ రాజకీయ పబ్బం కోసం, అధికారం కోసం టాక్స్ ఎగవేత దారులకు మద్దతుగా నిలబడడం ఏమిటి? ఈ ద్వంద నీతి వల్ల దేశం ఎలా బాగుపడుతుందో? చెప్పాలి. 70 వేల కోట్ల కుంబకోణాల ఆరోపణలు ఎదురుకుంటున్న అతన్ని ఎలా అన్ని ఆరోపణలతో విముక్తి చేసారో, చెప్పాలి!మీ వెంట ఎవరున్నా బారా ఖున్ మాఫీ చేసేస్తారా! పీఎం మోదీజీ దేశం ప్రశ్నిస్తున్నది. నల్ల ధనం వెలికి తీత కోసం వేసిన కమిటీ రిపోర్ట్ ఏది? దేశం వదిలి, బ్యాంక్ లకు చున్నం పెట్టి ఫరార్ అయిన వారిని ఎప్పుడు తీసుకుని వస్తారు.నల్ల ధనం రికవరీ ఏది?పౌరుల ఖాతాలో 15 లక్షలు ఎప్పుడు వేస్తారు? భారత్ లో ఇక పై అందరూ అజిత్ పవార్ లేనా?దేశం ప్రశ్నిస్తున్నది! జవాబు చెప్పండి! పీఎం మోడీ జీ! ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్,సామాజిక, రాజకీయ,విశ్లేషకులు 9951865223