Telangana : ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ రేసులోకి కొత్త పేరు

తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభర్థుల్లో దాదాపు అందరి పేర్లూ ప్రకటించేశారు. కానీ ఖమ్మం ఎంపీ టికెట్ మాత్రం ఎవరికి ఇస్తారనేది ఇంకా తేలలేదు. ఈ టికెట్ కోసం తెగ కసరత్తులు చేస్తోంది అధిష్టానం. ఈ నేపథ్యంలో రోజుకో కొత్త అభ్యర్థి పేరు తెర మీదకు వస్తోంది.

New Update
Telangana : ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ రేసులోకి కొత్త పేరు

Khammam Congress MP Ticket : లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్(Congress) ఇప్పటికే చాలా మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించేసింది. అయితే ఒక నాలుగు స్థానల్లో మాత్రం ఇంకా ఎవరు పోటీ చేస్తారనేది ఖరారు కాలేదు. అందులో ఖమ్మం(Khammam) స్థానానకి విపరీతంగా పోటీ ఉంది. ఇక్కడ ఎంపీ టికెట్ కోసం మంత్రులూ, పెద్ద తలకాయలు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ టికెట్ ఎవరికి ఇవ్వాలా అనే దాని మీ మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి పేరు తెర మీదకు వచ్చింది.

ఖమ్మం సీటు అయనకే?

ఖమ్మం ఎంపీ టికెట్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తుండగా ఢిల్లీ(Delhi) పెద్దలు మాత్రం మాజీ మంత్రికే టికెట్ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యారని టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి మండవ(Mandava Venkateshwara Rao) కే ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌(CM Revanth Reddy) కు మండవ సన్నిహితుడు. అంతకు ముందు వీరిద్దరూ కలిసి టీడీలో కూడా పని చేవారు. అంతేకాదు టీడీపీ ప్రభుత్వంలో మండవ మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉంది. దాంతో పాటూ ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆ వర్గం కూడా కలిసి వస్తుందనేది పెద్దల ఆలోచన. పైగా ఖమ్మం ఎంపీ సీటు కోసం భట్టి, పొంగులేటి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఇద్దరిలో ఎవరికి ఇచ్చిన మరొకరి దగ్గరి నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మధ్యే మార్గంగా...ఇద్దరికీ ఇబ్బంది లేకుండా మండవకు సీటు ఇస్తే బావుంటుందని కాంగ్రెస్ హైకమాండ్ అనుకుంటోందని చెబుతున్నారు. ఏఐసీసీ తుది పరిశీలనలోనూ మండవ పేరును చేర్చారని ఎబుతున్నారు. అయితే ఖమ్మం టికెట్ స్థానికులకు కాక స్థానికేతరుడికి ఎలా ఇస్తారని అక్కడ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. దీని మీద వ్యతిరేకత కూడా రావొచ్చని అంటున్నారు.

రామసహాయం రఘురామిరెడ్డి పేరూ తెర మీదకు...

అంతకు ముందు మరో కొత్త అభ్యర్ధి పేరూ తెర మీదకు వచ్చింది. మాజీ ఎంపీ ఆర్.సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా హైకమాండ్‌ ఖరారు చేశారని చెప్పారు. అయితే దీని వెనుక కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) హస్తం ఉందని.. పొంగులేటి మొదట తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం ప్రయత్నాలు చేశారు. అది కుదరకపోవడంతో రఘురామిరెడ్డి పేరు తెర మీదకు తీసుకువచ్చారని అన్నారు. ఈయన పొంగులేటికి వియ్యంకుడు. వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం పార్లమెంట్ ‌స్థానాల్లో.. పొంగులేటి, రామసహాయం కుటుంబాల ప్రభావం ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాలేరు నుంచి రఘురామిరెడ్డి పోటీకి దిగుతారని ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు ఎంపీ టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు సాగుతున్నాయని వినిపించింది. భట్టి భార్య నందినికి చెక్ పెట్టేందుకు పొంగులేటి తీవ్ర ప్రయత్నాలు చేశారనిచెప్పుకున్నారు కూడా.

Also Read : National: చైనాతో సత్సంబంధాలు చాలా అవసరం-ప్రధాని మోదీ

Advertisment
Advertisment
తాజా కథనాలు