Telangana: కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు

ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు ఇప్పుడు మరో వివిదంలో చిక్కుకున్నారు. తనను కిడ్నాప్ చేసి హింసించారని సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్ ఒకరు ఆతని మీద కంప్టైంట్ చేశారు.

New Update
Telangana:  కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు

Kalvakuntla Kanna Rao Land Grabbing Case : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఫిర్యాదుతో కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై కిడ్నాప్‌, బెదిరింపు కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. తనను కిడ్నాప్‌ చేసి హింసించారని ఐటీ ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో కన్నారావుతో పాటూ మరో నలుగురిపై క్రిమినల్‌ కేసులు కేసును నమోదు చేశారు. బిందుమాధురి, శ్యామ్‌ప్రసాద్‌ మరికొందరితో కలిసి కన్నారావు స్కెచ్‌ వేశారని సాఫ్ట్వేర్‌ విజయ్‌వర్థన్‌రావు చెబుతున్నారు. స్థల వివాదం గురించి మాట్లాడుకుందామని పిలిచి తనను ఇంట్లో బంధించి..బంగారం, నగదు ఎత్తుకెళ్లారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కట్టేసి కత్తులతో బెదిరించారని ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా, మానసికంగా హింసించారని.. అప్పటి ఏసీపీ భుజంగరావు తమకు తెలుసంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. తన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయించి మోసగించారని విజయ్‌వర్థన్‌ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న కన్నారావు..

అంతకు ముందు కొన్ని రోజుల క్రితమే కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నా రావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశాని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. కన్నారావు అసలు పేరు తేజేశ్వర్రావు. భూకబ్జా విషయంలో కన్నా రావుతో పాటు 38 మంది పై కేసులు నమోదు అయ్యాయి. 147,148,447,427,307,436,506,r/w149 IPC సెక్షన్ల కింద వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కన్నా రావు కోసం పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు కన్నారావును అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని మరికాసేపట్లో రిమాండ్ కు తరలించనున్నారు. ఇంతకు ముందే కన్నారావు అరెస్ట్ అవకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది.  హై కోర్ట్ లో కన్నా రావు బెయిల్ పిటిషన్‌ను రెండు సార్లు రిజెక్ట్ చేశారు.

Also Read:కాసరగోడ్‌ ఎన్నికల్లో బీజేపీకి అదనపు ఓట్లు..ఆరోపిస్తున్న ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్

Advertisment
Advertisment
తాజా కథనాలు