ఆ ఊరిలో ఒకే కుటుంబం ఉంటోంది.. ఎందుకో తెలుసా ? మహారాష్ట్రలోని మేల్‌ఘాట్ అటవీ ప్రాంతంలో పిలీ అనే గ్రామంలో ఒకే కుటుంబం నివసిస్తోంది. 20 ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్టు చేపట్టడంతో ఆ గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు వెళ్లిపోగా ఒకే కుటంబం మాత్రం అక్కడే నివసిస్తోంది. తమకు అక్కడే ఆస్తులు ఉండటంతో వెళ్లలేదని ఆ కుటుంబం చెబుతోంది. By B Aravind 13 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి సాధారణంగా ఒక ఊరు అంటే అందులో వంద సంఖ్యలో కుటుంబాలు ఉంటాయి. కానీ మహారాష్ట్రలోని మేల్‌ఘాట్ అనే అటవీ ప్రాంతంలోని పిలీ అనే ఊరిలో ఒకే కుటుంబం నివసిస్తోంది. ప్రస్తుతం ఈ గ్రామాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే ఇలా ఆ ఊరిలో ఒకే కుటుంబం నివసించడానికి కూడా ఓ పెద్ద కారణమే ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వాస్తవానికి ఆ గ్రామంలో గతంలో 500 వరకు కుటుంబాలు నివసించేవి. అయితే 20 ఏళ్ల క్రితం మేల్‌ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు కట్టడం ప్రారంభించారు. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా దాదాపు 37 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి వస్తుందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే 17 గ్రామాలను వేరే ప్రాంతాలకు తరలించారు. మరో ఆరు గ్రామాల తరలింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలోనే పిలీ అనే ఊరిలో ఉంటున్న 500 కుటుంబాలు 2021లోనే ఖాళీ చేసి వెళ్లిపోయాయి. అయితే అధికారులు కచ్చితంగా ఖాళీ చేయాల్సిందేనని ఆ గ్రామంలో ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. కేవలం ప్రభుత్వ నోటీసులు మాత్రమే పంపించింది. Also Read: హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత.. అయితే అందరూ వెళ్లిపోయినప్పటికీ భోగిలాల్ భాయిట్కర్ కుటుంబం మాత్రం ఆ పిలీ గ్రామాన్ని వీడలేదు. అతనితో పాటు భార్య, పిల్లలు కలిపి మొత్తం ఆరుగురు ఆ గ్రామంలోనే ఉంటున్నారు. అయితే ఆ కుటుంబం ఎందుకు వెళ్లలేకపోయిందో భాయిట్కర్ వివరించారు. తనకు వాళ్ల గ్రామంలో 25 ఎకరాల్లో వ్యవసాయ భూమి, పెద్ద ఇల్లు, 8 ఆవులు, 15 నుంచి 20 కోళ్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని తెలిపారు. తన పెద్ద కొడుకు పెళ్లి కూడా జరిగిందని.. అతను కూడా భార్యతో కలిసి ఇక్కడే ఉంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారని చెప్పారు. ఆ పిల్లల్ని తానే బైక్‌పై తీసుకెళ్లి సమీప గ్రామంలోని స్కూ్ల్‌లో దించేస్తానని తెలిపారు. అయితే భాయిట్కర్ తన వ్యవసాయ భూమికి, ఇల్లుకి సమానమైన ధరను చెల్లిస్తే.. ఆ ఊరిని విడిచి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లిపోతే ప్రభుత్వం కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇస్తుందని.. ఆ డబ్బుతో ఏం చేసుకోవాలంటూ భాయిట్కర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Also Read: పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ ఓనర్ #telugu-news #national-news #maharastra #village మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి