Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్..93 మంది మృతి!

బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. తాజా హింసలో 93 మంది పౌరులు మృతి చెందారు. అధికార పార్టీ మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగడంతో ఈ హింస మొదలైంది. మరణించినవారిలో 14 మంది పోలీసులు కూడా ఉన్నారు.

New Update
Strong India : బంగ్లాదేశ్ లాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో దృఢంగా భారత్

Bangladesh: బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. తాజా హింసలో 93 మంది పౌరులు మృతి చెందారు. అధికార పార్టీ మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగడంతో ఈ హింస మొదలైంది. మరణించినవారిలో 14 మంది పోలీసులు కూడా ఉన్నారు. వీరిలో 13 మంది పోలీసులు సిరాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో మృతి చెందారు.

1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటం జరగ్గా... ఆ ఘర్షణలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు 30 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. అయితే, ఈ రిజర్వేషన్లు ఎత్తివేసి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని బంగ్లాదేశ్ లోని ప్రధాన నగరాల్లో నిరసనకారులు రెండు రోజులుగా రోడ్లెక్కారు.

ఢాకా యూనివర్సిటీ విద్యార్థుల నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గతకొంతకాలంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 100 మంది వరకు మృతి చెందారు. తాజాగా, మరోసారి ఘర్షణలు చెలరేగడంతో బంగ్లాదేశ్ లో అధికారులు నిరవధిక కర్ఫ్యూ విధించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

సంగారెడ్డిలో దారుణం.. రోకలి బండతో భార్యను కొట్టి చంపిన భర్త!

సంగారెడ్డిలో ఓ భర్త భార్యను అతికిరాతకంగా రోకలి బండతో కొట్టి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. గొడవలతో పుట్టింటిలో ఉన్న భార్యపై కోపంతో దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన అత్తను రోకలితో కొట్టి గాయపరిచాడు. కుటుంబ సభ్యుల అనుమతితో భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
CRIME

CRIME

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పఠాన్ చెరువు మండలంలో పెద్దకంజర్ల గ్రామం రమిలా అనే మహిళకు సురేష్ (32)తో ఐదు సంవత్సరాల క్రితం ఘనంగా వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అయినప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

గొడవలు రావడంతో..

కానీ గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. చివరకు పంచాయతీ వరకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో రమిలా తన తల్లి ఇంటి దగ్గర ఉంటుంది. అయితే ఈ సమయంలో కూడా సురేశ్ అక్కడికి వెళ్లి గొడవ పడేవాడు. ఓ రోజు తీవ్ర ఆగ్రహానికి గురై రోకలి బండతో రమిలాపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అత్తను కూడా రోకలితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యుల అనుమతితో సురేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

హైదరాబాద్, వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జనగామ జిల్లా రాఘవాపూర్ వద్ద ఓ కారు లారీని బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

 

Advertisment
Advertisment
Advertisment