ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతా: డీకే అరుణ! తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, తనకు ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతానని ఈ విషయం పై మరోసారి మీడియా ఇలా ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తే న్యాయ విచారణకు సిద్ధంగా ఉండాలని డీకే అరుణ హెచ్చరించారు. By Bhavana 05 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి గత కొంత కాలంగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి వలసలు ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని ప్రసార మాధ్యమాలకు బాధ్యతలు అప్పగించినట్లు అనుమానం వస్తుందని ఆమె మండిపడ్డారు. తన నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం తాను ప్రచారం లో పాల్గొంటున్న విషయం కొన్ని పత్రికలు, ఛానళ్లకు కనిపించడం లేదా అని డీకే అరుణ ప్రశ్నించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, తనకు ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతానని ఈ విషయం పై మరోసారి మీడియా ఇలా ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తే న్యాయ విచారణకు సిద్ధంగా ఉండాలని డీకే అరుణ హెచ్చరించారు. ఇదిలా ఉండగా..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడు మీదున్న కాంగ్రెస్ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇతర పార్టీల ముఖ్యనేతలను ఆకర్షించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీజేపీలో ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...మీడియా పరంగా బలమైన నేత వివేక వెంకట స్వామి ని ఇప్పటికే కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు ముఖ్య నాయకులను ఎన్నికలకు ముందే పార్టీలోకి తీసుకుని బీజేపీని నియోజకవర్గ స్థాయిలోనూ పోటీలో లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ డీకే అరుణకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీలో జనాకర్షణ కలిగిన విజయశాంతిని తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డీకే అరుణ చెప్పిన మాటలు ఇప్పుడు కాంగ్రెస్ వారికి గట్టిగానే సమాధానం చెప్పినట్లు అయ్యింది. Also read: నాటుకోడి కూర, బగరా రైస్ వండిన మంత్రి కేటీఆర్! #congress #telangana #bjp #politics #dk-aruna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి