North Korea: యుద్ధం వస్తే శత్రువులను పూర్తిగా నాశనం చేస్తాం: ఉత్తర కొరియా

ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శుత్రువులను వినాశనం చేస్తామని తాజాగా ఉత్తర కొరియా ప్రకటించింది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ విధంగా వ్యాఖ్యానించారు.

New Update
North Korea: యుద్ధం వస్తే శత్రువులను పూర్తిగా నాశనం చేస్తాం: ఉత్తర కొరియా

ఓవైపు ఉక్రెయిన్- రష్యా, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల ప్రభావంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉండొచ్చని పలువురు విశ్లేషకులు ఇటీవల అంచనా వేసిన సంగతి సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉత్తర కొరియా.. ప్రపంచ దేశాలకు కీలక ఆదేశం చేసింది. ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శుత్రువులను పూర్తిగా వినాశనం చేస్తామని ప్రకటించింది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ విధంగా వ్యాఖ్యానించారు.

Also Read: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్‌.. షూటింగ్‌లో మను బాకర్‌కు కాంస్యం

అణుయుద్ధానికి అమెరికా, దక్షిణ కొరియాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో అధినేత నుంచి ఆదేశాలు వస్తే ఎలాంటి ఆలస్యం చేయకుండా శత్రువులను పూర్తిగా నాశనం చేసేందుకు అవసరమైన యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తర కొరియా సైనికాధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఇదిలాఉండగా.. దక్షిత కొరియాతో మూడేళ్ల పాటు జరిగిన యుద్ధానికి విరామమిస్తూ.. 1953లో జులైన 27న అమెరికా, చైనాలతో కలిసి ఉత్తర కొరియా ఓ తాత్కాలిక సంధి కుదుర్చుకుంది. జులై 27న విక్టరీ దినోత్సవంగా ఉత్తర కొరియా ఏటా ఉత్సవాలు నిర్వహిస్తోంది. దక్షిణ కొరియా మాత్రం ఎలాంటి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సంధిగానే పరిగణిస్తోంది. ఈ యుద్ధ విరామానికి ఒప్పందం జరగకపోవడం వల్ల సాంకేతికంగా ఇరుదేశాలు ఇంకా యుద్ధంలో ఉన్నట్లేనని భావిస్తున్నాయి.

Also Read: బైడెన్‌ను బలవంతంగా తొలగించారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు గత కొంతకాలంగా అమెరికా, ఉత్తర కొరియా మధ్య దౌత్య సంబంధాలు లేకపోవడం, అలాగే 2019 నుంచి అణునిరాయిధీకరణపై చర్చలు కూడా నిలిచిపోయాయి. అయితే అమెరికాకు కొత్త అధ్యక్షుడు ఎవరు వచ్చినా కూడా ఈ పరిణామంలో మార్పు ఉంటుందని ఆశించడం లేదని ఉత్తర కొరియా ఇటీవలే ప్రకటించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

తాను పట్టుకున్న కుందేలుకు మూడ కాళ్ళు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎవరైనా తగ్గాల్సిందే కానీ తాను తగ్గేదే లే అంటున్నారు. తాజాగా చైనాపై ఏకంగా 104 శాతం సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుని..ఆ దేశానికి షాక్ ఇచ్చారు.  

New Update
tariffs

USA-China

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరి పోయింది.  చైనా వెనక్కు తగ్గకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ మూడు రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఆ దేశంపై విధిస్తున్న సుంకాలను 104 శాతం పెంచి భారీ షాక్ ఇచ్చారు. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ కార్యదర్శి ప్రకటించారు. 

ముందే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు..

రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనాపై 54 శాతం సుంకాలను విధింారు. దీనికి ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై ట్రపం మండిపడ్డారు చైనా తప్పు చేస్తోందని హెచ్చరించారు. ఏప్రిల్ 8లోగా సుంకాలను తగ్గించకపోతే 50శాతం పెంచుతామని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈరోజు చైనాపై ఏకంగా 104 శాతం మేర టారీఫ్ లను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

today-latest-news-in-telugu | usa | china | trump tariffs

Also Read: PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..

 

Advertisment
Advertisment
Advertisment