నువ్వాసలు మనిషివేనా..8 లక్షల కోసం భార్య బిడ్డని పాము తో కాటేయించి..!

ఒడిశాలో పాము కాటు బాధితులకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తారనే ఆశతో ఓ వ్యక్తి భార్యని బిడ్డని పాముతో కాటేయించి చంపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update
నువ్వాసలు మనిషివేనా..8 లక్షల కోసం భార్య బిడ్డని పాము తో కాటేయించి..!

ఒడిశాలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్య బిడ్డ పట్ల మానవత్వం మరిచిపోయి ప్రవర్తించాడు. ఇంట్లో నిద్రిస్తున్న వారి వద్దకు పామును విడిచిపెట్టి వారిని చాలా తెలివిగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గంజాం జిల్లాలోని కబి సూర్య నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అధీగావ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల గణేశ్ పాత్రాకు బసంతి పాత్ర తో 3 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి దేబాస్మిత అనే రెండేళ్ల కుమార్తె ఉంది. అయితే భార్య భర్తలిద్దరూ తరచూ గొడవపడుతుండేవారు. ఈ క్రమంలోనే వారిని ఎలాగైనా చంపేయాలని భావించాడు.

అందుకు గానూ పక్క ప్రణాళికలు రూపొందించాడు. ఇందుకోసం ఎవరికీ అనుమానం రాకుండా వారిని చంపేందుకు పామును ఆయుధంగా ఉపయోగించాడు. పాములు పట్టే వ్యక్తి వద్ద నుంచి అత్యంత విషపూరితమైన పామును తీసుకుని దానిని ఎలాగోలా ఇంటికి తీసుకుని వచ్చాడు.

రాత్రి సమయంలో భార్య , కూతురు పడుకున్న గదిలోనికి పామును విడిచిపెట్టాడు. ఆ తరువాత అతను వేరే గదిలో నిద్రించాడు. తెల్లారి చూసేసరికి భార్య కూతురు నురుగలు కక్కుకుని చనిపోయి ఉన్నారు. అయితే ఈ మరణాలు గురించి బసంతి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.

సుమారు నెలన్నర తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గణేశ్‌ని అనుమానించిన పోలీసులు అతనిని విచారించగా ముందు నిందితుడు నిజాలు ఒప్పుకోలేదు. పోలీసులు తమదైన శైలిలో విచారించే సరికి అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి గదిలోకి తానే పామును వదిలినట్టు అంగీకరించడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే పాముకాటు బాధితుల కోసం రూ. 8 లక్షల ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని - ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు ఇస్తారనే ప్రలోభాలు అతన్ని ఈ ప్రణాళికను రూపొందించడానికి దారితీసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also read: ఫేక్‌ వీడియోలు వైరల్ కావచ్చు..కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి..కేటీఆర్ పిలుపు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!

తండ్రికి బైక్‌ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది.  చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

New Update
bike-accident suryapet

bike-accident suryapet

తండ్రికి బైక్‌ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చెడే జనార్దన్‌కు కుమార్తె యశస్విని (24), కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో యశస్విని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే తనకు విద్యాబుద్ధులు నేర్పి తనను ఇంతటి ఉన్నతస్థాయికి చేర్చిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఇటీవల ఆమె కొనుగోలు చేసింది.  ఆ బైక్ ను తీసుకుని హైదరాబాద్ నుంచి తన కొలీగ్ నాగఅచ్యుత్‌కుమార్‌తో కలిసి శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేంది. 

Also read :  India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

యశస్వినిని ఢీకొట్టి తలమీదుగా

అయితే శనివారం అర్ధరాత్రి 12:30 గంటట సమయంలో ఆకుపాముల వద్ద  నేషనల్ హైవేపై చనిపోయి ఉన్న గేదెను గుర్తించక దానిని ఢీకొని పడిపోయారు. అదే టైమ్ లో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ యశస్వినిని ఢీకొట్టి తలమీదుగా వెళ్లడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. బైక్ నడుపుతున్న నాగఅచ్యుత్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడనుంచి పరారయ్యాడు.  బాధితురాలి బాబాయ్ చేడె సురేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం యశస్విని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.  

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

 

Advertisment
Advertisment
Advertisment