Odisha: నెలసరికి సెలవు..మహిళా ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం కానుక

స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు గుడ్‌ న్యూస్ చెప్పింది. మహిళా ఉద్యోగులకు ప్రతీ నెల ఒకరోజు నెలసరి సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ ఇది వర్తించనుంది.

New Update
Odisha: నెలసరికి సెలవు..మహిళా ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం కానుక

Leave for Women on Periods Time: ఒడిశా ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వాతంత్య్ర దినోత్సవ కానుకను ప్రకటించింది. నెలసరి రోజుల్లో మహిళలకు ఒకరోజు సెలవు ఇస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఒడిశా డిప్యూటీ సీఎం పార్వతీ పరీదా ప్రకటించారు. ఒడిశాలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగినులతో పాటుగా ప్రైవేటులో పనిచేసే మహిళా ఉద్యోగులకు కూడా ఈ నెలసరి సెలవు వర్తిస్తుందని పార్వతీ పరీదా తెలిపారు. మహిళల నెలసరి సమయంలో మొదటి రోజు లేదా రెండో రోజు ఈ సెలవును ఉపయోగించుకోవచ్చును.

భారతదేశంలో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో మాత్రమే మహిళలకు నెలసరి సెలవును ఇస్తున్నారు. 1992లోనే బీహార్ ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అక్కడ నెలకు రెండు రోజులు సెలవు ఇస్తున్నారు. గతేడాది నుంచి కేరళ ప్రభుత్వం కూడా ఈ సెలవును ఇస్తోంది. అక్కడ విద్యాసంస్థలు, యూనివర్శటీలు, మహిళా ఉద్యోగులు అందరికీ సెలవును ఇస్తున్నారు. ఇప్పుడు ఒడిశా దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా నెలసరి సెలవులకు సంబంధించి ఎలాంటి చట్టం లేదు.మహిళలకు నెలసరి సెలవులకు సంబంధించి 2022లోనే కేంద్రం ఓ బిల్లు తీసుకువచ్చింది. అయితే ఆ బిల్లు ఇప్పటికీ ఆమోదం పొందలేదు.

Also Read: Cricket: సరికొత్తగా దులీప్ ట్రోఫీ..ఫార్మాట్‌ను మార్చిన బీసీసీఐ

Advertisment
Advertisment
తాజా కథనాలు