Woman : గే ఫ్రెండ్ కోసం బిడ్డను కనాలని మహిళ ప్లాన్.. మహిళ పోస్టు వైరల్! ఓ మహిళ తన గే ఫ్రెండ్ కోసం గర్భవతి కావాలని, పిల్లలను కనాలని ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది.అప్పుడు అతను ఏం చేశాడో తెలుసుకోండి! By Durga Rao 22 Apr 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి Baby Child : చాలా మందికి పెళ్లి(Marriage) చేసుకోవాలని, తల్లిదండ్రులు(Parents) అనిపించుకోవాలని ఉంటుంది. అయితే అందరికీ ఆ అదృష్టం ఉండదు. వివిధ కారణాలతో కొందరికి పిల్లలు జన్మించరు. ఈ రోజుల్లో పిల్లలు వద్దని నిర్ణయించుకుంటున్న భార్యభర్తలు(Wife & Husband) కూడా ఉన్నారు. ఇలానే ఓ జంట కూడా తమకు పిల్లలు వద్దనుకుంది. అయితే భార్య ఇప్పుడు తన గే ఫ్రెండ్(Gay Friend) (స్వలింగ సంపర్కుడి) కోసం గర్భవతి కావాలని, పిల్లలను కనాలని నిర్ణయించుకోవడంతో సమస్య మొదలైంది. దీనికి సంబంధించిన పోస్ట్ పబ్లిక్ ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్(Reddit) లో వైరల్ అయింది. 26 ఏళ్ల వివాహిత తన పరిస్థితిని వివరిస్తూ పోస్టు చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్, గే అయిన వ్యక్తి కోసం బిడ్డను కనాలని భావిస్తున్నట్లు భర్తకు తెలిపింది. కానీ భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. తన సమస్యను వివరిస్తూ నెటిజన్ల స్పందన కోరింది. తన స్నేహితుడు స్వలింగ సంపర్కుడని, అతనికి పెళ్లి అయిందని తెలిపింది. గే కపుల్ తనను అండం దానం(Egg Donor) చేయాలని కోరినట్లు తెలిపింది. అలాగే పుట్టే బిడ్డకు తల్లిగా తానే ఉండాలని వారు కోరుకుంటున్నారని, తనకు కూడా సాయం చేయాలని ఉందని ఆమె తెలిపింది. అయితే ఈ విషయం తెలిసిన తన భర్త ఒప్పుకోలేదని వివరించింది. ‘నాకు 26,నా బెస్ట్ ఫ్రెండ్ కు (మేల్, 26) ఉన్నాడు. అతను స్వలింగ సంపర్కుడు. అతని గే పార్ట్‌నర్‌ను పెళ్లి చేసుకున్నాడు. నాకు భర్త ఉన్నాడు. మేము పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నాం. నా గే ఫ్రెండ్, అతని పార్ట్‌నర్ ఒక బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు.’ అని మహిళ రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొంది. అనానమస్ యూజర్‌గా ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది. తన బెస్ట్ ఫ్రెండ్ కోసం ఎగ్ డోనర్‌గా మారడానికి సిద్ధంగా ఉన్న ఆమె, ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. అయితే తన భార్య కడుపులో మరో పురుషుడి బిడ్డను మోయడాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. ‘మనం పాపకు అంకుల్, ఆంటీలా ఉందామని నా భర్తతో చెప్పాను. అతడు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయన నాతో మాట్లాడటం లేదు’ అని పోస్ట్‌లో పేర్కొంది. Also Read : సీఎం జగన్ ఆస్తుల విలువ తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే * నెటిజన్ల మిశ్రమ స్పందన ఆమె చేసిన పోస్టుకు నెటిజన్ల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్సెస్ వచ్చాయి. భార్య ప్రాణ స్నేహితుడి కోసం గర్భవతి(Pregnancy) కావాలని నిర్ణయించుకునే ముందు భర్తను సంప్రదించకపోవడాన్ని ఎక్కువ మంది తప్పుబట్టారు. అయితే భర్తతో బిడ్డకు జన్మనివ్వడం లేదా బెస్ట్ ఫ్రెండ్ బిడ్డకు తల్లి కావడం అనేది ఆమెకు మాత్రమే సంబంధించిన విషయం అని ఒకరు కామెంట్ చేశారు.మీ భర్త బాధపడటానికి, కోపంగా ఉండటానికి కారణాలు ఉన్నాయని మరొకరు పేర్కొన్నారు. ‘ఇలా కాకుండా మరోలా స్పందన ఉంటుందని మీరు ఎలా అనుకున్నారు?’ అని ప్రశ్నించారు. బెస్ట్ ఫ్రెండ్ కోసం గర్భవతి కావడానికి ముందు, ఈ విషయం గురించి భర్తతో పూర్తిగా చర్చించి నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని ఒక యూజర్ సలహా ఇచ్చారు. #viral-news #pregnancy #trending-news #gay-friend మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి